మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ‘గాడ్‌ఫాదర్’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’కి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహనరాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌లో రెండు నెలల నుంచి చిరు పాల్గొంటున్నాడు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌లో స్వల్ప మార్పులు చేశారు. అయితే ఒరిజినల్ వెర్షన్ లాగా చిరంజీవి పాత్రలో మహిళా ప్రధాన పాత్ర ఉండదు.
మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ‘గాడ్‌ఫాదర్’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’కి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహనరాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌లో రెండు నెలల నుంచి చిరు పాల్గొంటున్నాడు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌లో స్వల్ప మార్పులు చేశారు. ఒరిజినల్ వెర్షన్ లాగానే చిరంజీవి పాత్రలో మహిళా ప్రధాన పాత్ర ఉండదనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో సల్మాన్ ఖాన్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఒరిజినల్‌లో పృథ్వీరాజ్ పోషించిన పాత్రకు సల్లూ భాయ్‌ని ఒప్పించారు. చిరు, సల్మాన్‌లపై ఓ పాటను కూడా ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో మరో ముఖ్యమైన పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించారు మేకర్స్. ఒరిజినల్ వెర్షన్‌లో మంజువారియర్ పోషించిన పాత్రనే తెలుగులో ఆమె చేయబోతున్నట్లు టాక్. నిజానికి ఈ పాత్రకు ముందుగా నయనాయనే అనుకున్నారు. అప్పుడు శోభన పేరు వినిపించింది. ఎట్టకేలకు రమ్యకృష్ణ రంగ ప్రవేశం చేసింది. ఆమె ముఖ్యమంత్రి కూతురుగా చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించనుంది. రమ్యకృష్ణ మెగాస్టార్ సరసన పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినా.. కెరీర్ ప్రారంభంలో ‘చక్రవర్తి’ సినిమాలో ఆయన చెల్లెలుగా నటించి మెప్పించింది. ఇప్పుడు మరోసారి చిరుకి చెల్లెలుగా రమ్యకృష్ణ నటించడం ఆసక్తికరంగా మారింది. ఇందులో ముఖ్యమంత్రి తనయుడిగా సత్యదేవ్ మరో ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
నవీకరించబడిన తేదీ – 2021-11-16T17:46:09+05:30 IST