మహేష్ – రాజమౌళి కాంబో: విలన్‌గా కోలీవుడ్ స్టార్?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2021-11-22T13:53:42+05:30 IST

దర్శకుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘RRR’ని వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తారక్, చెర్రీ హీరోలుగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇది ఇలా ఉండగా.. ఇప్పుడిప్పుడే జక్కన్న తదుపరి సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి ఓ రేంజ్ లో వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబుతో భారీ సినిమా చేయనున్న రాజమౌళి.. ఆఫ్రికన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ను కథాంశంగా ఎంచుకున్నాడు.

మహేష్ - రాజమౌళి కాంబో: విలన్‌గా కోలీవుడ్ స్టార్?

దర్శకుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘RRR’ని వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తారక్, చెర్రీ హీరోలుగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇది ఇలా ఉండగా.. ఇప్పుడిప్పుడే జక్కన్న తదుపరి సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి ఓ రేంజ్ లో వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబుతో భారీ సినిమా చేయనున్న రాజమౌళి.. ఆఫ్రికన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ను కథాంశంగా ఎంచుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా కథకు సంబంధించిన వివరాలను విజయేంద్ర ప్రసాద్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ బాబు గూఢచారిగా నటిస్తున్నట్లు సమాచారం. జేమ్స్ బాండ్ స్టైల్ గెటప్ తో అలరించబోతున్నాడు మహేష్. అలాంటి సినిమాకు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ను విలన్ గా జక్కన్న ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.

ఇందులో నిజం ఉందో లేదో తెలియదు కానీ విక్రమ్ విలన్ అయితే సినిమా మరో రేంజ్ లో ఉంటుందా? ఈ వార్తపై అభిమానులు కూడా ఆసక్తిగా ఉన్నారు. రాజమౌళి తన ప్రతి సినిమాకు పాన్-ఇండియా స్థాయిలో ఆలోచిస్తాడు. అందుకే మహేష్ తో చేయబోయే సినిమాకు తమిళ స్టార్ హీరోనే విలన్ గా ఫిక్స్ చేస్తున్నాడని చెప్పొచ్చు. అంతేకాదు ఈ సినిమాలో ఇతర భాషలకు చెందిన మరికొందరు క్రేజీ నటీనటులను ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదల తర్వాత ఈ సినిమా ప్రకటన రానుంది. నటీనటులు, సిబ్బందిని కూడా ప్రకటిస్తారు. గతంలో ‘ఇంకొక్కడు’ సినిమాలో ట్రాన్స్ జెండర్ మేకోవర్ తో విలన్ గా అలరించిన విక్రమ్ ఈ సినిమాలో మరో గెటప్ లో కనిపించనున్నాడు.

నవీకరించబడిన తేదీ – 2021-11-22T13:53:42+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *