పుష్ప ది రైజ్ : బాలీవుడ్ ప్రమోషన్స్ కోసం క్రేజీ రూట్లో బన్నీ

పుష్ప ది రైజ్ : బాలీవుడ్ ప్రమోషన్స్ కోసం క్రేజీ రూట్లో బన్నీ

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2021-11-28T17:40:04+05:30 IST

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ జంటగా నటించిన మూడో చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, సింగిల్స్ అభిమానుల‌ను ఖుషీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని ఐదో సింగిల్ తో పాటు ‘పుష్ప’ ట్రైలర్ కూడా త్వరలో రెడీ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ పాన్ ఇండియా మూవీ హిందీ ప్రమోషన్స్‌ను వినూత్నంగా చేయబోతున్నాడు బన్నీ.

పుష్ప ది రైజ్ : బాలీవుడ్ ప్రమోషన్స్ కోసం క్రేజీ రూట్లో బన్నీ

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ జంటగా నటించిన మూడో చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, సింగిల్స్ అభిమానుల‌ను ఖుషీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని ఐదో సింగిల్ తో పాటు ‘పుష్ప’ ట్రైలర్ కూడా త్వరలో రెడీ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ పాన్ ఇండియా సినిమా హిందీ ప్రమోషన్స్‌ను వినూత్నంగా చేయబోతున్నాడు బన్నీ. ఏఏ ఫిలింస్ విడుదల చేస్తున్న ఈ సినిమా హిందీ వెర్షన్ కి మంచి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు బన్నీ.

అందులో భాగంగానే సల్లూభాయ్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ వేదికను బన్నీ ఉపయోగించుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ‘బిగ్ బాస్’ 15వ సీజన్ నడుస్తోంది. ఇందులో బన్నీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అల్లు అర్జున్ నటించిన చాలా సినిమాల హిందీ వెర్షన్‌లకు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో బాలీవుడ్ లోనూ బన్నీ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమాలోని ఓ పాటకు బన్నీకి థ్యాంక్స్ చెప్పాడు. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ బాలీవుడ్ ప్రమోషన్స్‌ని సల్మాన్‌ఖాన్‌ సమక్షంలో చేయాలని ‘పుష్ప’ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ‘బిగ్ బాస్ 15’కి బన్నీ ఏ రేంజ్ లో హాజరవుతాడో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2021-11-28T17:40:04+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *