‘గాడ్‌ఫాదర్‌’లో ‘కేజీఎఫ్‌2’ విలన్‌?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2021-11-28T16:45:41+05:30 IST

తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాడ్ ఫాదర్’ మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం. మలయాళంలో వచ్చిన ‘లూసిఫర్‌’కి ఇది రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. తెలుగు నేటివిటీకి అనుగుణంగా చిరు ఇమేజ్‌కి తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో చిన్న చిన్న మార్పులు చేశారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో అప్‌డేట్‌ అభిమానులను ఆనందపరుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సినిమాకు సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'గాడ్‌ఫాదర్‌'లో 'కేజీఎఫ్‌2' విలన్‌?

తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాడ్ ఫాదర్’ మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం. మలయాళంలో వచ్చిన ‘లూసిఫర్‌’కి ఇది రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. తెలుగు నేటివిటీకి అనుగుణంగా చిరు ఇమేజ్‌కి తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో చిన్న చిన్న మార్పులు చేశారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో అప్‌డేట్‌ అభిమానులను ఆనందపరుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సినిమాకు సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం నయనతార ఎంపికైన సంగతి తెలిసిందే. అలాగే.. ఆమె సోదరుడి పాత్రకు సత్యదేవ్ ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి.

ఈ సినిమాలో నయనతార భర్తగా, ఈ చిత్రానికి విలన్‌గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను అత్యంత కీలక పాత్రగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంజూ భాయ్ ‘కేజీఎఫ్2’లో అధీర అనే పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్నారు. ఆయన లుక్‌కి మంచి స్పందన వచ్చింది. అందుకే ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాలో విలన్‌గా ఎంపికయ్యాడు. ఒరిజినల్ వెర్షన్‌లో వివేక్ ఒబెరాయ్ పాత్రను పోషించారు. నాగార్జున ‘చంద్రలేఖ’లో అతిథిగా చిన్న పాత్రలో కనిపించిన సంజయ్ దత్ మళ్లీ తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడు. మరి ఈ వార్తల్లో నిజం ఉందో లేదో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2021-11-28T16:45:41+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *