టాలీవుడ్ టాప్ బ్యూటీ సమంత చైతూతో విడిపోయిన తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం గుణశేఖర్ పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’లో టైటిల్ రోల్ పోషిస్తున్న ఆమె.. తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి కమిట్ అయింది. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఇద్దరు దర్శకులు హరి, హరీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దానికి ‘యశోద’ అనే క్యాచీ టైటిల్ ఫిక్స్ చేశారు. ఆసక్తికరమైన కథనాలతో సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాలో తన పాత్ర సామ్ ను థ్రిల్ చేసింది.

టాలీవుడ్ టాప్ బ్యూటీ సమంత చైతూతో విడిపోయిన తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం గుణశేఖర్ పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’లో టైటిల్ రోల్ పోషిస్తున్న ఆమె.. తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి కమిట్ అయింది. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఇద్దరు దర్శకులు హరి, హరీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దానికి ‘యశోద’ అనే క్యాచీ టైటిల్ ఫిక్స్ చేశారు. ఆసక్తికరమైన కథనాలతో సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాలో తన పాత్ర సామ్ ను థ్రిల్ చేసింది. అందుకే వెంటనే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ లేకపోవటం ఆశ్చర్యం కలిగించే విషయం. హీరో హీరోయిన్లు ఇద్దరూ సమంతే అని నిర్మాతలు చెబుతున్నారు. అయితే ఇందులో కీలక పాత్ర కోసం మేకర్స్ కోలీవుడ్ విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్‌ను సంప్రదించారు. ఆమె పాత్ర చాలా వైవిధ్యంగా ఉండటంతో ఇందులో నటించేందుకు వరు అంగీకరించారు. వరలక్ష్మి శరత్ కుమార్ కు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. అలాగే.. ఆమె మలయాళ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు. అందుకే యశోద సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. మరి ‘యశోద’కి వరలక్ష్మి ఎంపిక ఏ రేంజ్ లో అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2021-12-09T18:42:33+05:30 IST