మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ఇది 50వ సినిమా. ఇప్పటికి ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ నెల జూన్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేసి.. దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అనూహ్యంగా ‘భారతీయుడు 2’ చిత్రానికి లైన్ క్లియర్ కావడంతో శంకర్ అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. శంకర్ 6 నెలల పాటు అందుబాటులో ఉండడు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ఇది 50వ సినిమా. ఇప్పటికి ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది జూన్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేసి దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అనూహ్యంగా ‘భారతీయుడు 2’ చిత్రానికి లైన్ క్లియర్ కావడంతో శంకర్ అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. శంకర్ 6 నెలల పాటు అందుబాటులో ఉండడు. ఈ గ్యాప్‌లో రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి సినిమాని లైన్లో పెట్టాడు. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి శంకర్ వచ్చేలోపు షూటింగ్ పూర్తి చేయాలన్నది చరణ్ ప్లాన్.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను గౌతమ్ తిన్ననూరి ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటివరకు హీరోయిన్‌గా ఎవరినీ ఆలోచించలేదు. కానీ గౌతమ్ మాత్రం దిశాపటానిని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నాడు. దాదాపు ఆమెనే అని తెలుస్తోంది. దిశా పటాని, వరుణ్ తేజ్, పూరి నటించిన ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. సినిమా అంతగా అలరించకపోయినా దిశా గ్లామర్‌కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత బాలీవుడ్ కెళ్లి.. అక్కడ స్టార్ హీరోయిన్ గా స్థిరపడింది. ఇంతకీ ఆమె టాలీవుడ్ లో మళ్లీ హీరోయిన్ గా నటిస్తుందనే ఆసక్తి రామ్ చరణ్ సినిమాపై నెలకొంది. మరి ఈసారి డైరెక్షన్ ఫేజ్ ఎలా ఉంటుందో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2021-12-27T15:24:51+05:30 IST