‘యశోద’లో సమంత పాత్ర ఇదేనా?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2021-12-29T21:03:41+05:30 IST

నాగ చైతన్యతో పెళ్లి పీటలెక్కిన సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లోనూ సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక సామ్ లేటెస్ట్ కమిట్మెంట్ తెలుగు సినిమా ‘యశోద’. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైంది. కథ విని చాలా ఎగ్జైట్ అయిన సామ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్. అతీంద్రియ అంశాలు కూడా కథలో భాగంగా ఉంటాయి.

‘యశోద’లో సమంత పాత్ర ఇదేనా?

నాగ చైతన్యతో పెళ్లి పీటలెక్కిన సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లోనూ సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక సామ్ లేటెస్ట్ కమిట్మెంట్ తెలుగు సినిమా ‘యశోద’. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైంది. కథ విని చాలా ఎగ్జైట్ అయిన సామ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్. అతీంద్రియ అంశాలు కూడా కథలో భాగంగా ఉంటాయి. అయితే సమంత పాత్రపై ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం యశోద సినిమాలో సమంత నర్స్ గా నటిస్తోందని అంటున్నారు. హీరోయిన్ సెంట్రిక్ స్టోరీ కాబట్టి సినిమాలో ఆమె క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని అర్ధమవుతుంది. ఆమె పాత్రను డిజైన్ చేసిన విధానం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని అంటున్నారు. హరి, హరీష్ అనే ఇద్దరు దర్శకులు నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఉన్నిముకుందన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు.

నవీకరించబడిన తేదీ – 2021-12-29T21:03:41+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *