ఇది రష్మిక లేడీ ఓరియెంటెడ్ సినిమా కథనా?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-01-10T18:26:15+05:30 IST

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవలే ‘పుష్ప’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టింది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ‘ఆడవాళ్లు వుక్కే జోహార్లు’ సినిమాలో నటిస్తోంది. అలాగే.. ‘మిషన్ మజ్ను, గుడ్ బై’ కూడా బాలీవుడ్ చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. రష్మిక ఈ ఏడాది మరో ఆసక్తికరమైన చిత్రానికి కమిట్ అవుతుంది. ఇది ఆమె మొదటి లేడీ ఓరియెంటెడ్ సినిమా. రాహుల్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా ‘శ్యామ్ సింహరాయ్’లో నాని అన్నగా కీలక పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు రాహుల్. అదే ఉత్సాహంతో ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు.

ఇది రష్మిక లేడీ ఓరియెంటెడ్ సినిమా కథనా?

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవలే ‘పుష్ప’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ‘ఆడవాళ్లు వుక్కే జోహార్లు’ సినిమాలో నటిస్తోంది. అలాగే.. ‘మిషన్ మజ్ను, గుడ్ బై’ కూడా బాలీవుడ్ చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇవి కాకుండా ఈ ఏడాది మరో ఇంట్రెస్టింగ్ సినిమాకు కమిట్ అవుతోంది. ఇది ఆమె మొదటి లేడీ ఓరియెంటెడ్ సినిమా. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా ‘శ్యామ్ సింహరాయ్’లో నాని అన్నగా కీలక పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు రాహుల్. ప్రస్తుతం ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ మలయాళ సినిమా రీమేక్ వెర్షన్‌లో హీరోగా నటిస్తున్నాడు. దాంతో పాటు ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

సినిమా కథ మొత్తం రష్మిక చుట్టూనే తిరుగుతుంది. 1995లో ప్రధానిగా ఉన్న పి.వి.నరసింహారావు భారతదేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టి క్రమబద్ధమైన ఆర్థిక వ్యవస్థను కొనసాగించారు. ఈ నేపథ్యాన్ని దర్శకుడు రాహుల్ ఈ కథకు జోడిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ కిరాణా వ్యాపారి కూతురు పెద్ద బిజినెస్ ఉమెన్‌గా ఎలా ఎదిగిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రష్మిక పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని తెలుస్తోంది. నాగార్జునతో చేసిన ‘మన్మథుడు 2’ పరాజయం తర్వాత రాహుల్ ఈ సినిమాతో దర్శకుడిగా మళ్లీ ఫామ్‌లోకి రావాలనుకుంటున్నాడు. మరి ఈ సినిమా రష్మికకు ఎంత పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2022-01-10T18:26:15+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *