పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘భీమ్లానాయక్, హరిహర వీరమల్లు’ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు పవర్ స్టార్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్సింగ్’ సినిమాకు కూడా కమిట్‌మెంట్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాని గతేడాది ప్రకటించారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత మళ్లీ పవన్, హరీష్ ల కాంబో రిపీట్ అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వరుణ్ తేజ్ తో ‘గద్దలకొండ గణేష్’ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టిన హరీష్ శంకర్, అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ తో ‘భవదీయుడు భగత్సింగ్’ సినిమా చేయబోతున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘భీమ్లానాయక్, హరిహర వీరమల్లు’ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు పవర్ స్టార్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్సింగ్’ సినిమాకు కూడా కమిట్‌మెంట్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాని గతేడాది ప్రకటించారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత మళ్లీ పవన్, హరీష్ ల కాంబో రిపీట్ అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వరుణ్ తేజ్ తో ‘గద్దలకొండ గణేష్’ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టిన హరీష్ శంకర్, అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ తో ‘భవదీయుడు భగత్సింగ్’ సినిమా చేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్రలో నటిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీని ప్రకారం ఈ సినిమాలో పవర్‌స్టార్‌తో పోరాడేందుకు ఓ పవర్‌ఫుల్ విలన్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
తమిళ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. ‘మాస్టర్, ఉప్పెన’ చిత్రాలను మించే స్థాయిలో ‘భవదీయుడు భగత్సింగ్’లో విలనిజం చూపించబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు హరీష్ శంకర్ తన క్యారెక్టర్ ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసాడు. ఈ సినిమాలో నటించేందుకు విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో విజయ్ సేతుపతి విలనిజం ఏ మేరకు హైలైట్ అవుతుందో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2022-01-18T14:36:35+05:30 IST