దేవిశ్రీ ప్రసాద్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-01-19T16:45:06+05:30 IST

టాలీవుడ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ లో ముందుగా వచ్చే పేరు దేవిశ్రీ ప్రసాద్. 23 ఏళ్ల క్రితం ‘దేవి’ సినిమాతో దేవి సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత దేవి ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు. మినిమమ్ బడ్జెట్ సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు ఆయన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. లేటెస్ట్ మూవీ ‘పుష్ప’తో దేవిశ్రీ పేరు నేషనల్ వైడ్ గా మారుమోగుతోంది. ఈ చిత్రం యొక్క హిందీ వెర్షన్ పాటలు యూట్యూబ్ గ్లోబల్ మ్యూజిక్ వీడియో చార్ట్‌లో టాప్ 100గా జనాదరణ పొందాయి.

దేవిశ్రీ ప్రసాద్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా?

టాలీవుడ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ లో ముందుగా వచ్చే పేరు దేవిశ్రీ ప్రసాద్. 23 ఏళ్ల క్రితం ‘దేవి’ సినిమాతో దేవి సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత దేవి ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు. మినిమమ్ బడ్జెట్ సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు ఆయన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. లేటెస్ట్ మూవీ ‘పుష్ప’తో దేవిశ్రీ పేరు నేషనల్ వైడ్ గా మారుమోగుతోంది. ఈ చిత్రం యొక్క హిందీ వెర్షన్ పాటలు యూట్యూబ్ గ్లోబల్ మ్యూజిక్ వీడియో చార్ట్‌లో టాప్ 100గా జనాదరణ పొందాయి. ఈ సందర్భంగా టీసీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ దేవిశ్రీ ప్రసాద్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. గతంలో హిందీ డబ్బింగ్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడైన దేవిశ్రీ.. ఇంకా స్ట్రెయిట్ హిందీ సినిమాలకు సంగీతం అందించలేదు. అయితే ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది.

ఇటీవల దేవి, భూషణ్ కుమార్‌లను కలవడం విశేషం. టిసిరీస్ సంస్థ నిర్మించనున్న భారీ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవి ప్రసాద్ ఫిక్స్ అయ్యారని టాక్. గతంలో తమన్‌కి బాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చింది. అయితే తమన్ ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో దేవి ఉంది. మరి దేవి సంగీతం అందించనున్న సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2022-01-19T16:45:06+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *