కళ్యాణ్‌దేవ్‌ను మెగా ఫ్యామిలీ దూరం చేస్తుందా?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-01-19T22:37:57+05:30 IST

మెగా కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ దంపతుల విషయం కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్‌గా శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కళ్యాణ్ పేరు శ్రీజకళ్యాణ్‌ని తొలగించి శ్రీజ కొణిదెలగా మార్చుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. సరిగ్గా ధనుష్, ఐశ్వర్య విడిపోయిన రోజే శ్రీజ పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, అందుకే ఈ జంట కూడా త్వరలో విడిపోనుందని వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఇటీవలే సంక్రాంతికి విడుదలైన ‘సూపర్ మచ్చ’ సినిమాకు మెగాఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు.

కళ్యాణ్‌దేవ్‌ను మెగా ఫ్యామిలీ దూరం చేస్తుందా?

మెగా కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ దంపతుల విషయం కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్‌గా శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కళ్యాణ్ పేరు శ్రీజకళ్యాణ్‌ని తొలగించి శ్రీజ కొణిదెలగా మార్చుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. సరిగ్గా ధనుష్, ఐశ్వర్య విడిపోయిన రోజే శ్రీజ పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, అందుకే ఈ జంట త్వరలో విడిపోనుందని వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఇటీవలే సంక్రాంతికి విడుదలైన ‘సూపర్ మచ్చ’ సినిమాకు మెగాఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. అందుకు తగ్గట్టుగానే ఎలాంటి పబ్లిసిటీ లేకుండానే థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. ఆ సినిమాను హీరో కళ్యాణ్ దేవ్ పట్టించుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి.

కళ్యాణ్ దేవ్ నటించిన ‘కిన్నెరసాని’ కూడా త్వరలో విడుదల కానుంది. ఇక ఆ సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందన్న విమర్శలు వస్తున్నాయి. కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా ‘విజేత’కి మెగా ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ లభించింది. సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోయినా మెగాస్టార్ చిన్నల్లుడు హీరోగా వచ్చిన సంగతి తెలిసిందే. చైతూతో విడిపోయే ముందు సమంత అక్కినేనిని తన పేరులోంచి తీసేసినట్లే, శ్రీజ తన భర్త పేరును తీసేయడంతో కళ్యాణ్ దేవ్ కెరీర్ ముగిసినట్లేనని చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే ఆయన ‘సూపర్ మచ్చి’ సినిమాను ఎవరూ పట్టించుకోలేదని తెలుస్తోంది. మరి ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2022-01-19T22:37:57+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *