యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ప్రస్తుతం ‘శేఖర్’ అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరికొన్ని చిత్రాలను లైన్‌లో పెట్టారు. అయితే హీరోగా నటిస్తూనే మరో సినిమాలో ప్రధాన పాత్రకు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. శ్రీవాస్ దర్వకత్వంలో గోపీచంద్ హీరోగా మూడో సినిమా. ‘లక్ష్యం, లౌక్యం’ చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్, శ్రీవాస్ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో గోపీచంద్‌కు మెంటార్ పాత్ర కోసం రాజశేఖర్‌ని సంప్రదించారు.
యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ప్రస్తుతం ‘శేఖర్’ అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరికొన్ని చిత్రాలను లైన్‌లో పెట్టారు. అయితే హీరోగా నటిస్తూనే మరో సినిమాలో ప్రధాన పాత్రకు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. శ్రీవాస్ దర్వకత్వంలో గోపీచంద్ హీరోగా మూడో సినిమా. ‘లక్ష్యం, లౌక్యం’ చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్, శ్రీవాస్ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో గోపీచంద్‌కు మెంటార్ పాత్ర కోసం రాజశేఖర్‌ని సంప్రదించారు. ఈ చిత్రానికి రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మేకర్స్ త్వరలో ప్రకటించబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ సినిమా నుంచి రాజశేఖర్ తప్పుకున్నట్లు సమాచారం. తన పాత్ర నచ్చక ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడా? లేక.. సెట్స్‌కి ఆలస్యంగా వస్తున్నందున నిర్మాతలు తప్పించుకున్నారా? అది తెలియలేదు. ఏది ఏమైనా.. రాజశేఖర్‌ను క్రేజీ పాత్రలో చూడాలనుకున్న ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. రాజశేఖర్ చేయకపోతే.. అలాంటి పాత్రలకు మరో ఆప్షన్ జగపతి బాబే. ఇలాంటి పాత్రలు ఎన్నో చేసాడు. గోపీచంద్, శ్రీవాస్ కాంబోలో వచ్చిన మొదటి సినిమా ‘లక్ష్యం’లో జగపతిబాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, గోపీకి అన్నయ్యగా నటించిన సంగతి తెలిసిందే. అలాగే.. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాక్ష్యం’ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటించాడు. మరి ఆ పాత్రకు శ్రీవాస్ జగపతిబాబుని ఎంచుకుంటారో లేదో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2022-02-01T18:35:51+05:30 IST