రామ్ పోతినేని: మళ్లీ ద్విపాత్రాభినయం?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-02-08T18:15:26+05:30 IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో కాప్ థ్రిల్లర్ ‘ది వారియర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరి చిత్రం బోయపాటి దర్శకత్వంలో ఉంటుందనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ‘అఖండ’తో పెద్ద హిట్‌ అందుకున్న బోయపాటి రామ్‌ సినిమా కోసం హైవోల్టేజ్‌ యాక్షన్‌ ప్లాట్‌ వండుతున్నట్లు తెలుస్తోంది. బోయపాటి స్టోరీ లైన్ రామ్‌ని ఇంప్రెస్ చేసి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

రామ్ పోతినేని: మళ్లీ ద్విపాత్రాభినయం?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో కాప్ థ్రిల్లర్ ‘ది వారియర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరి చిత్రం బోయపాటి దర్శకత్వంలో ఉంటుందనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ‘అఖండ’తో పెద్ద హిట్‌ అందుకున్న బోయపాటి రామ్‌ సినిమా కోసం హైవోల్టేజ్‌ యాక్షన్‌ ప్లాట్‌ వండుతున్నట్లు తెలుస్తోంది. బోయపాటి స్టోరీ లైన్ రామ్‌ని ఇంప్రెస్ చేసి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో సినిమా తెరకెక్కుతోంది.

ఇప్పటికే రామ్ ‘రెడ్’ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. అలాగే.. లింగుసామితో కలిసి ‘ది వారియర్’లో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ‘స్మార్ట్ శంకర్’తో తనలోని మాస్ యాంగిల్ ని బయటకి తెచ్చిన రామ్.. బోయపాటి సినిమాలో అంతకు మించి మాస్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నాడు. ఎలాంటి హీరోతోనైనా హిట్ కొట్టాలన్నది బోయపాటి విద్య.. యాక్షన్ ఫార్ములా. మరి ఈ సినిమాలో రామ్ మేకోవర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2022-02-08T18:15:26+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *