హనుమాన్: షాకింగ్ ప్రీరిలీజ్ బిజినెస్?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-02-16T21:23:02+05:30 IST

యంగ్ హీరో తేజ సజ్జా, యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ జంటగా నటించిన రెండో చిత్రం ‘హనుమాన్’. ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ తెలుగులో తొలి సూపర్ హీరో చిత్రంగా గుర్తింపు పొందింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘జాంబి రెడ్డి’ సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ‘హనుమాన్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కళ్లు చెదిరే గ్రాఫిక్స్ మాయాజాలంతో అంజనాద్రి అనే కొత్తలోకంలోకి తీసుకెళ్తాడు దర్శకుడు. గతంలో విడుదలైన హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది.

హనుమాన్: షాకింగ్ ప్రీరిలీజ్ బిజినెస్?

యంగ్ హీరో తేజ సజ్జా, యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ జంటగా నటించిన రెండో చిత్రం ‘హనుమాన్’. ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ తెలుగులో తొలి సూపర్ హీరో చిత్రంగా గుర్తింపు పొందింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘జాంబి రెడ్డి’ సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ‘హనుమాన్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కళ్లు చెదిరే గ్రాఫిక్స్ మాయాజాలంతో అంజనాద్రి అనే కొత్తలోకంలోకి తీసుకెళ్తాడు దర్శకుడు. గతంలో విడుదలైన హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రైమ్ టైమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే స్థాయిలో జరిగినట్లు సమాచారం.

‘జాంబి రెడ్డి’ సినిమా హిందీలో డబ్ అయి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో ‘హనుమాన్’ సినిమా హిందీ హక్కులు కళ్లు చెదిరే రీతిలో అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 5 కోట్లకు హిందీ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా తెలుగు శాటిలైట్, డిజిటల్ హక్కులను జీ గ్రూప్ దాదాపు రూ. 11 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ‘హనుమాన్’ చిత్రానికి రూ. 16 కోట్ల తెలుగు, హిందీ నాన్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. థియేట్రికల్ రైట్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది. తేజ సజ్జ లాంటి హీరోకి ఈ రేంజ్ లో ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం విశేషం.

నవీకరించబడిన తేదీ – 2022-02-16T21:23:02+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *