భీమ్‌లా నాయక్: మెగా ఫ్యామిలీకి స్పెషల్ షో..!

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-02-19T18:06:37+05:30 IST

మెగా ఫ్యామిలీకి భీమ్లా నాయక్ సినిమా స్పెషల్ షో వేయనున్నారనే వార్త తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మెగా హీరోలు నటించిన సినిమాలను మిగిలిన కుటుంబ సభ్యులు చూసేందుకు స్పెషల్ షోలు వేస్తారు.

భీమ్‌లా నాయక్: మెగా ఫ్యామిలీకి స్పెషల్ షో..!

మెగా ఫ్యామిలీకి భీమ్లా నాయక్ సినిమా స్పెషల్ షో వేయనున్నారనే వార్త తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మెగా హీరోలు నటించిన సినిమాలను మిగిలిన కుటుంబ సభ్యులు చూసేందుకు స్పెషల్ షోలు వేస్తారు. ఇప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ మూవీని స్పెషల్ షో వేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పవర్ స్టార్‌ని భీమ్లా నాయక్‌గా వెండితెరపై చూసేందుకు మెగా ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యామిలీ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌తో సహా అన్నీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికెట్ పొందింది. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవితో సహా మెగా ఫ్యామిలీ కోసం నిర్మాత నాగవంశీ ప్రివ్యూ షో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవితో పాటు సినీ హీరోలు పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి చూడనున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ థియేటర్లో మెగా హీరోలందరూ సినిమా చూసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ ప్రివ్యూ తేదీని చూడాల్సి ఉంది. భీమ్లా నాయక్ గా పవన్ రియాక్షన్ ఏంటని అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు.

యువ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని మెగా అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఫిబ్రవరి 25న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్లు సమాచారం. మరి వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మంచి హిట్ అందుకోగా.. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాతో ఏ రేంజ్ హిట్స్ అందుకుంటాడో చూడాలి. కాగా, ఈ నెల 21న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు.

నవీకరించబడిన తేదీ – 2022-02-19T18:06:37+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *