సూపర్ స్టార్ సహాయం కోరిన పాన్ ఇండియా స్టార్?

సూపర్ స్టార్ సహాయం కోరిన పాన్ ఇండియా స్టార్?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-02-23T21:02:38+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, తాజా చిత్రం ‘రాధేశ్యం’ వచ్చేనెల 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా… కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తున్నారు. మెరైన్ ఎక్స్‌పర్ట్‌గా ప్రభాస్ హస్త వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ బహుభాషా చిత్రంలో సత్యరాజ్, జగపతిబాబు, భాగ్యశ్రీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిజానికి సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన సినిమా కరోనా కారణంగా ఆలస్యంగా థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. అలాగే సింగిల్స్ కి కూడా మంచి క్రేజ్ వచ్చింది.

సూపర్ స్టార్ సహాయం కోరిన పాన్ ఇండియా స్టార్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, తాజా చిత్రం ‘రాధేశ్యం’ వచ్చేనెల 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా… కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తున్నారు. మెరైన్ ఎక్స్‌పర్ట్‌గా ప్రభాస్ హస్త వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ బహుభాషా చిత్రంలో సత్యరాజ్, జగపతిబాబు, భాగ్యశ్రీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిజానికి సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన సినిమా కరోనా కారణంగా ఆలస్యంగా థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. అలాగే సింగిల్స్ కి కూడా మంచి క్రేజ్ వచ్చింది. త్వరలో మేకర్స్ ‘రాధేశ్యామ్’ ప్రమోషన్స్‌ను మళ్లీ ప్రారంభించబోతున్నారు.

ఈ సినిమా హిందీ వెర్షన్‌కి బిగ్ బి అమితాబ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అంటే సినిమా కథ మొత్తం అమితాబే చెప్పబోతుందన్నమాట. ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కాగా, సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. ‘రాధేశ్యామ్’ తెలుగు వెర్షన్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడట. ఆ మేరకు మహేష్ సహాయం కోరాడు ప్రభాస్. తెలుగులో మహేష్ వాయిస్ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇటీవల ఆయనను సంప్రదించారు. ప్రభాస్ కోసం రాధేశ్యామ్ సినిమాకు కథకుడు అవుతానని మహేష్ మాట ఇచ్చాడు. అయితే ఇది ఎంత వరకు నిజం అనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించేంత వరకు తెలియదు.

గతంలో పవన్ కళ్యాణ్ ‘జల్సా’ చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌తో ఉన్న అనుబంధం కారణంగానే ఈ చిత్రానికి మహేష్ వాయిస్‌ని ఇచ్చాడు. అది సినిమాకు ప్లస్ అయింది. మహేష్ వాయిస్‌తో త్రివిక్రమ్ చమత్కారమైన మాటలు థియేటర్లలో పేలాయి. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాలో మరోసారి మహేష్ వాయిస్ వినిపించనుంది. మరి ఈ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఏ మేరకు హైలైట్ అవుతుందో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2022-02-23T21:02:38+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *