పంచాయితీకి జయమ్మ భారీ పారితోషికం?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-03-06T19:15:00+05:30 IST

సుమ తన టాలెంట్ తో స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది. మాతృభాష తెలుగు కాకపోయినా అచ్చ తెలుగు అనర్గళంగా మాట్లాడి మెప్పించింది. కెరీర్ బిగినింగ్‌లో హీరోయిన్‌గా ఎంచీ ఇచ్చినా సక్సెస్ కాకపోయినా తన కఠోర శ్రమతో ఇప్పుడు స్టార్ యాంకర్‌గా స్థిరపడింది. ప్రస్తుతం ఒక్కో ఈవెంట్‌కు 3 నుంచి 5 లక్షలు తీసుకుంటున్నారు సుమ. అడపాదడపా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించినా పూర్తి స్థాయిలో ఏ సినిమాలోనూ నటించలేదు. అయితే ఇప్పుడు ‘జయమ్మ పంచాయతీ’ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.

పంచాయితీకి జయమ్మ భారీ పారితోషికం?

సుమ తన టాలెంట్ తో స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది. మాతృభాష తెలుగు కాకపోయినా అచ్చ తెలుగు అనర్గళంగా మాట్లాడి మెప్పించింది. కెరీర్ బిగినింగ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. సక్సెస్ కాకపోయినా.. ఇప్పుడు తన కఠోర శ్రమతో స్టార్ యాంకర్‌గా స్థిరపడింది. ప్రస్తుతం ఒక్కో ఈవెంట్‌కు 3 నుంచి 5 లక్షలు తీసుకుంటున్నారు సుమ. అడపాదడపా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించినా పూర్తి స్థాయిలో ఏ సినిమాలోనూ నటించలేదు. అయితే ఇప్పుడు ‘జయమ్మ పంచాయతీ’ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. కొత్త దర్శకుడు విజయ్ కుమార్ కొలివరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి సుమ భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం ఆమె దాదాపు రూ. 50 లక్షల వరకు వసూలు చేశారు. ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు ఆమె అడిగినవన్నీ ఇచ్చారని సమాచారం. ఈ సినిమా థియేటర్లలో వర్కవుట్ కాకపోయినా కనీసం ఓటీటీ, టీవీల్లో అయినా బాగా వెళ్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఉందో లేదో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2022-03-06T19:15:00+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *