ప్రభాస్ సినిమా టైటిల్ మారుతుందా? | ప్రభాస్, మారుతీ కాంబో మూవీ krkk-MRGS-చిత్రజ్యోతి టైటిల్ మారవచ్చు

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-03-06T19:56:08+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ మరో ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని తర్వాత ‘ఆదిపురుష, సాలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్’ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇవి కాకుండా ప్రభాస్ మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. కామెడీ ఎంటర్‌టైనర్స్‌తో అలరించిన దర్శకుడు మారుతి కొద్దిరోజులుగా ప్రభాస్‌తో ఓ ఇంట్రెస్టింగ్ సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం మారుతి కథకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త ప్రచారంలోకి వచ్చింది.

ప్రభాస్ సినిమా టైటిల్ మారుతుందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ మరో ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని తర్వాత ‘ఆదిపురుష, సాలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్’ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇది కాకుండా ప్రభాస్ మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. కామెడీ ఎంటర్‌టైనర్స్‌తో అలరించిన దర్శకుడు మారుతి కొద్దిరోజులుగా ప్రభాస్‌తో ఓ ఇంట్రెస్టింగ్ సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం మారుతి కథకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త ప్రచారంలోకి వచ్చింది.

ఈ సినిమాకి ‘రాజాడెలక్స్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ టైటిల్ కి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో మారుతి మరో టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రానికి ఆ రేంజ్‌లో ఓ ప్రత్యేకమైన టైటిల్‌ని ఫిక్స్‌ చేయనున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. సినిమా విడుదలయ్యాక సినిమా ప్రకటన ఉంటుందని, అదే సమయంలో సినిమాకు టైటిల్ ఫిక్స్ చేస్తారని అంటున్నారు. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

నవీకరించబడిన తేదీ – 2022-03-06T19:56:08+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *