బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం సౌత్, నార్త్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ‘రాధేశ్యాం’ సినిమా ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటూనే.. పలు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటోంది. అంతే కాకుండా చేతిలో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తమిళంలో దళపతి విజయ్ సరసన మృగం చిత్రంలో నటించిన అమ్మడు, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో మహేష్ సరసన కథానాయికగా మెరవబోతోంది. ఇది కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాలో పూజా హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం సౌత్, నార్త్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ‘రాధేశ్యం’ సినిమా ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటూనే.. పలు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటోంది. అంతే కాకుండా చేతిలో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తమిళంలో దళపతి విజయ్ సరసన మృగం చిత్రంలో నటించిన అమ్మడు, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మహేష్ సరసన కథానాయికగా మెరవబోతోంది. ఇది కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాలో పూజా హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల ‘భీంలానాయక్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇక క్రిష్ ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. త్వరలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాన్ని ప్రారంభించబోతున్నాడు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. రీసెంట్‌గా ‘రాధేశ్యామ్’ సినిమా ప్రమోషన్స్‌లో పూజా ఇదేంటని ప్రశ్నించగా.. హరీష్‌ని అడగొద్దు అని బదులిచ్చింది. దానికి అవునో కాదో చెప్పలేదు. ఐతే ఈ సినిమాలో ఆమెనే హీరోయిన్ అనే టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు మైత్రి ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు పూజా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాన్ని మైత్రీవారే నిర్మిస్తున్నారు కాబట్టి పవర్ స్టార్ పెయిర్ కీలుబొమ్మ కావడం ఖాయమని అంటున్నారు. హరీష్ శంకర్ గత చిత్రాలైన ‘దువ్వాడ జగన్నాథమ్, గద్దల కొండ గణేష్’లో పూజా హెగ్డే కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.
నవీకరించబడిన తేదీ – 2022-03-09T19:54:00+05:30 IST