అనసూయ భరద్వాజ్ యాంకర్ గా సూపర్ సక్సెస్ అయ్యింది. వెండితెరపై కూడా కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే ఆమెకు కెరీర్‌లో మంచి పాత్రలు వచ్చాయి. భాషతో సంబంధం లేకుండా ఆమె పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఇప్పుడు అనసూయ తన ట్రాక్ మార్చే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బుల్లితెరపై యాంకర్‌గా ఇన్నాళ్లూ కామెడీ స్కిట్‌లతో నవ్వించింది. జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో అనసూయ హాస్యభరితమైన పాత్రలో కనిపించనుంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోంది. శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించనున్నారు. అనసూయ లేడీ లీడ్ రోల్ చేయబోతుండడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

అనసూయ బుల్లితెర కామెడీ షోలలో నవ్వించడానికి ప్రయత్నించింది కానీ వర్కవుట్ కాలేదు. ఈసారి ఆమె కామెడీ ప్రేక్షకులను అలరించబోతోందని టాక్. అనసూయతో పాటు ఇతర నటీనటులతో చక్కటి కామెడీ వర్కవుట్ చేశామని మేకర్స్ చెబుతున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా ప్రకటన రానుంది. రీసెంట్ గా మలయాళంలో ‘భీష్మ పర్వం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనసూయ తమిళంలో కూడా ఓ సినిమాకు కమిట్ అయింది. అలాగే.. తెలుగులో చాలా సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మరి ఈ కామెడీ సినిమాతో అనసూయ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2022-03-14T13:48:41+05:30 IST