యువ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన పవర్ స్టార్?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-03-17T20:46:47+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల భీమ్లానాయక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరి హరవీరమల్లు’ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే పవర్ స్టార్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దీని తర్వాత వపన్ కళ్యాణ్ ఓ యువ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని టాక్. ఆ దర్శకుడు మరెవరో కాదు సుధీర్ వర్మ. ‘స్వామిరారా, దోచేయ్, కేశవ, కిరాక్ పార్టీ, రణరంగం’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సుధీర్ వర్మ ప్రస్తుతం రవితేజ హీరోగా ‘రావణాసుర’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ కాగానే పవర్ స్టార్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గతేడాది తమిళంలో విడుదలైన ‘వినోదయ చిట్టం’ సూపర్ హిట్‌గా నిలిచింది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తంబి రామయ్య మరో ముఖ్య పాత్రలో నటించారు. ఇదొక సోషియో ఫాంటసీ సినిమా. హాలీవుడ్ క్లాసిక్ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తరహాలో వినోదాత్మకంగా సాగే చిత్రమిది. నిజానికి ఒకే కథాంశంతో వివిధ భాషల్లో సినిమాలు వచ్చాయి. గతంలో తెలుగులో మంచు విష్ణు, నాగార్జున జంటగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కృష్ణార్జున’ స్టోరీ లైన్ కూడా అదే. అయితే ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో పవర్ స్టార్ తో రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ తనదైన శైలిలో స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించబోతున్నాడని అంటున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. సముద్రఖని పాత్రలో పవర్ స్టార్ నటించనుండగా, తంబి రామయ్య పాత్రలో సాయిధరమ్ తేజ్ నటించబోతున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే… కొన్ని రోజులు ఆగాల్సిందే.

నవీకరించబడిన తేదీ – 2022-03-17T20:46:47+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *