పుష్ప ద రూల్ : ‘లోఫర్’ గాళ్ ఐటెం సాంగ్?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-03-20T17:32:24+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అన్ని భాషల్లో అత్యధిక కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. ఈ సినిమాతో బన్నీ పేరు జాతీయ స్థాయిలో మారుమోగింది. ఈ సినిమాపై బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా కావడంతో రెండో భాగం ‘పుష్ప ది రూల్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు సుకుమార్ గతంలో రాసుకున్న స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాడని అంటున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కేరళలోని దట్టమైన అడవుల్లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘పుష్ప’ ఫస్ట్ హాఫ్ లో సమంత చేసిన ‘ఊ అంటావా మావా ఊ అంటావా మావా’ ఐటం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ క్రమంలో సెకండ్ పార్ట్ లోనూ దీన్ని మించిన ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.

పుష్ప ద రూల్ : 'లోఫర్' గాళ్ ఐటెం సాంగ్?

నిజానికి బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని సమంత ఐటెం సాంగ్ కోసం అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో సమంత సీన్‌లోకి ప్రవేశించింది. అయితే రెండో భాగంలో దిశా పటానీకి అవకాశం ఇవ్వాలని సుక్కు టీమ్ ఆలోచిస్తోంది. దిశా పటానీని సంప్రదించబోతున్నారు. దిశా గతంలో వరుణ్ తేజ్, పూరి కాంబో మూవీ ‘లోఫర్’తో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమా రిజల్ట్‌తో పాటు ఆమె గ్లామర్‌కి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత దిశా పటానీ బాలీవుడ్‌కి వెళ్లి అక్కడే స్థిరపడింది. ‘పుష్ప’ తొలి భాగంలో ఐటెం సాంగ్‌కి సమంతకు మంచి క్రేజ్ రావడంతో రెండో భాగానికి వచ్చిన అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోనుందట. మరి ఈ వార్తల్లో నిజం ఉందో లేదో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2022-03-20T17:32:24+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *