‘ప్రాజెక్ట్ K’లో ‘K’ అంటే అదేనా?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-03-21T15:35:59+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ‘రాధేశ్యామ్’ సినిమాతో అభిమానులను సంతోష పరిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్, సాలార్, ప్రాజెక్ట్ కె’ వంటి భారీ పాన్ ఇండియా సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో ‘ఆదిపురుష’ సినిమా పూర్తిగా పౌరాణిక చిత్రం కాగా, ‘సాలార్’ సినిమా పూర్తి యాక్షన్ సినిమా. సోషియో ఫాంటసీగా ‘ప్రాజెక్ట్ కె’ సినిమా రూపొందుతోందని టాక్. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇదే మాట వినిపిస్తోంది. అయితే ఎలాంటి కథ అనేది ఇప్పటి వరకు తెలియలేదు.

'ప్రాజెక్ట్ K'లో 'K' అంటే అదేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ‘రాధేశ్యామ్’ సినిమాతో అభిమానులను సంతోష పరిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్, సాలార్, ప్రాజెక్ట్ కె’ వంటి భారీ పాన్ ఇండియా సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో ‘ఆదిపురుష’ సినిమా పూర్తిగా పౌరాణిక చిత్రం కాగా, ‘సాలార్’ సినిమా పూర్తి యాక్షన్ సినిమా. సోషియో ఫాంటసీగా ‘ప్రాజెక్ట్ కె’ సినిమా రూపొందుతోందని టాక్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇదే మాట వినిపిస్తోంది. అయితే ఎలాంటి కథ అనేది ఇప్పటి వరకు తెలియలేదు. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ టైటిల్‌లోని ‘కె’ అనే అక్షరం దేనికి సంకేతం అనే ఆసక్తికర విషయాలు తెలిశాయి.

తాజా సమాచారం ప్రకారం మహాభారతంలోని రెండు ప్రధాన పాత్రల ఆధారంగా ‘ప్రాజెక్ట్ కె’ సినిమా కథాంశం రూపొందుతోంది. అందులో ఒకటి విష్ణుమూర్తి కల్కి అవతారం అయితే, రెండోది అశ్వథ్ధామ పాత్ర. ప్రభాస్ కల్కి పాత్రలో నటిస్తుండగా, అమితాబ్ అశ్వత్థామ పాత్రలో నటిస్తున్నారు. అశ్వత్థామ చిరంజీవి మహాభారతంలో ద్రోణుని కుమారుడు. అతనికి మరణం లేదు. అసలు ‘ప్రాజెక్ట్ కె’ అంటే ‘ప్రాజెక్ట్ కల్కి’ అని టాక్స్. కల్కి విష్ణువు యొక్క పదవ అవతారం. కలియుగాంతంలో విష్ణువు కల్కి అవతారం ఎత్తబోతున్నాడని పురాణాలు చెబుతున్నాయి. దుష్టుడిని చంపేందుకు వీరోచిత ఖడ్గం ధరించి తెల్ల గుర్రంపై స్వారీ చేసే అవతార్ ఆధారంగా నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ని ఆసక్తికరంగా రూపొందిస్తున్నట్లు సమాచారం. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది.

నవీకరించబడిన తేదీ – 2022-03-21T15:35:59+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *