బన్నీ – ధనుష్ కాంబినేషన్ లో మల్టీస్టారర్.. నిజమేనా?

బన్నీ – ధనుష్ కాంబినేషన్ లో మల్టీస్టారర్.. నిజమేనా?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-03-29T16:25:49+05:30 IST

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో తెలిసిందే. హాలీవుడ్ చిత్రాలను పక్కన పెట్టి కలెక్షన్లలో కొత్త అధ్యాయానికి తెరతీస్తోంది ఈ చిత్రం. ఆ సినిమా స్ఫూర్తితో మరికొందరు దర్శకులు క్రేజీ హీరోలతో మల్టీ స్టారర్లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి క్రేజీ కాంబినేషన్ గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే ‘పుష్ప’ సినిమాతో నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్.. రెండు నేషనల్ అవార్డ్స్ గెలుచుకుని మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న తమిళ స్టార్ హీరో ధనుష్ తో జోడీ కట్టబోతున్నాడు. మరి ఈ కాంబో సెట్ చేయబోతున్న డైరెక్టర్ ఎవరో తెలుసా? రాజమౌళి తర్వాత టాలీవుడ్‌లో తిరుగులేని దర్శకుడిగా కనిపిస్తున్న కొరటాల శివ.

బన్నీ - ధనుష్ కాంబినేషన్ లో మల్టీస్టారర్.. నిజమేనా?

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో తెలిసిందే. హాలీవుడ్ చిత్రాలను పక్కన పెట్టి కలెక్షన్లలో కొత్త అధ్యాయానికి తెరతీస్తోంది ఈ సినిమా. ఆ సినిమా స్ఫూర్తితో మరికొందరు దర్శకులు క్రేజీ హీరోలతో మల్టీ స్టారర్లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి క్రేజీ కాంబినేషన్ గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే ‘పుష్ప’ సినిమాతో నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్.. రెండు నేషనల్ అవార్డ్స్ గెలుచుకుని మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న తమిళ స్టార్ హీరో ధనుష్ తో జోడీ కట్టబోతున్నాడు. మరి ఈ కాంబో సెట్ చేయబోతున్న డైరెక్టర్ ఎవరో తెలుసా? రాజమౌళి తర్వాత టాలీవుడ్‌లో తిరుగులేని దర్శకుడిగా కనిపిస్తున్న కొరటాల శివ.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చిత్రాన్ని సిద్ధం చేసిన కొరటాల.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రెండో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. యన్టీఆర్ 30వ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈసారి ఆయన మల్టీ స్టారర్ చేయనున్నాడని, బన్నీతో పాటు ధనుష్ కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది. ధనుష్ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అంతకు ముందు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు బన్నీ. అందుకే కొరటాల వీరిద్దరితో భారీ మల్టీ స్టారర్ పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

నవీకరించబడిన తేదీ – 2022-03-29T16:25:49+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *