మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఒకప్పుడు తన దోపిడీతో పోలీసులను బెదిరించి మూడు చెరువుల నీళ్లు తాగించిన కరుడుగట్టిన నేరస్థుడు నాగేశ్వర్‌రావు బయోపిక్‌గా ఈ సినిమా రూపొందనుంది. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కానీ ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు కావస్తున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. తాజా సమాచారం ప్రకారం ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాన్ని ఉగాదికి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా’ సినిమాల షూటింగ్‌లు పూర్తి కాగానే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని అంటున్నారు. రవితేజ ఫస్ట్ బయోపిక్, క్రైమ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఒకప్పుడు తన దోపిడీతో పోలీసులను బెదిరించి మూడు చెరువుల నీళ్లు తాగించిన కరుడుగట్టిన నేరస్థుడు నాగేశ్వర్‌రావు బయోపిక్‌గా ఈ సినిమా రూపొందనుంది. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనౌన్స్ చేసి చాలా రోజులు కావస్తున్నా.. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. తాజా సమాచారం ప్రకారం ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాన్ని ఉగాదికి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా’ సినిమాల షూటింగ్‌లు పూర్తి కాగానే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని అంటున్నారు. రవితేజ ఫస్ట్ బయోపిక్, క్రైమ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా కథాంశంలో చాలా షేడ్స్ ఉంటాయని అంటున్నారు. నాగేశ్వరరావు జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఈ సినిమా కథకు మంచి వెయిటేజీని ఇస్తాయని భావిస్తున్నారు. అందుకే ఈ సినిమాను ఇతర భాషల్లోకి డబ్ చేయకుండా తెలుగులో తీయబోతున్నారు. ఆ క్రమంలో పలువురు బాలీవుడ్ స్టార్లతో పాటు ఇతర భాషా నటీనటులను కూడా ఎంపిక చేయబోతున్నారని అంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తారు. మరి టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ ఎంత పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2022-03-29T19:51:35+05:30 IST