మూడేళ్లుగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకే ఫిదా అయిన యంగ్ టైగర్ యంతీఆర్.. ఇప్పుడు రిలాక్స్ అయ్యారు. త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. మరోవైపు ‘ఉప్పెన’ బుచ్చిబాబు స్పోర్ట్స్ డ్రామాకు స్క్రిప్ట్ రాసి ఎన్టీఆర్ తో సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. దానికి ‘పెద్ది’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. ఉప్పెన తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా వాటన్నింటినీ పక్కనబెట్టి తన తదుపరి చిత్రాన్ని యన్టీఆర్ తోనే చేయాలని నిర్ణయించుకున్నాడు. 1980 నాటి పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా కథాంశం. ఈ కథ యన్టీఆర్‌కి బాగా నచ్చింది.
మూడేళ్లుగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకే ఫిదా అయిన యంగ్ టైగర్ యంతీఆర్.. ఇప్పుడు రిలాక్స్ అయ్యారు. త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. మరోవైపు ‘ఉప్పెన’ బుచ్చిబాబు స్పోర్ట్స్ డ్రామాకు స్క్రిప్ట్ రాసి ఎన్టీఆర్ తో సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. దానికి ‘పెద్ది’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. ఉప్పెన తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా వాటన్నింటినీ పక్కనబెట్టి తన తదుపరి చిత్రాన్ని యన్టీఆర్ తోనే చేయాలని నిర్ణయించుకున్నాడు. 1980 నాటి పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా కథాంశం. ఈ కథ యన్టీఆర్‌కి బాగా నచ్చింది. ఈ సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు. అయితే ఈ కథలో రిస్క్ ఉందని ఫిల్మ్ నగర్ సమాచారం. కథ డిమాండ్ ను బట్టి.. కొన్ని సన్నివేశాల్లో కథానాయకుడు వికలాంగుడిగా కనిపించాలి. ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటుందా లేదా అనే సందేహం అందరిలోనూ ఉంది. ఇప్పుడు అదే డౌట్ యన్టీఆర్ కు వచ్చినట్లు తెలుస్తోంది. కథలో ఆ భాగమే కీలకం. దానిని పక్కన పెట్టవద్దు. ఆ సీన్ చేస్తే అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని యన్టీఆర్ ఆందోళన చెందుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
యన్టీఆర్ ఈ కథను వదిలిపెట్టడానికి ఇష్టపడటం లేదు. అందుకే ఈ సినిమా ఆలస్యమవుతోంది. ‘ఉప్పెన’లో కూడా ఇలాంటి ప్రమాదం ఉంది. క్లైమాక్స్ మార్చమని చాలా మంది బుచ్చిబాబుపై ఒత్తిడి తెచ్చారు. కానీ మార్చేందుకు బుచ్చిబాబు అంగీకరించలేదు. ఆ క్లైమాక్స్‌తో సినిమా విడుదలైంది. సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఆ సినిమాకి ఈ సినిమాకి తేడా ఏంటంటే.. వైష్ణవ్ తేజ్ కి ఇదే మొదటి సినిమా. దానివల్ల అతనికి ఇమేజ్ లేదు. కాబట్టి ఇది పని చేసింది. అయితే ఇక్కడ యన్టీఆర్ అలా కాదు.. టాలీవుడ్ లో బెస్ట్ పెర్ఫార్మర్, మంచి క్రేజ్ ఉంది. అలాంటి హీరోని వికలాంగుడిగా చూపిస్తే అభిమానుల స్పందన ఎలా ఉంటుందనే సందేహం అందరిలోనూ నెలకొంది. అయితే బుచ్చిబాబు మాత్రం ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని, ఈ విషయంలో యన్టీఆర్‌ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. ‘RRR’తో పాన్ ఇండియా స్టార్ అయిన యన్టీఆర్ ఇలాంటి పాత్ర చేస్తే పెద్ద రిస్క్ అని చాలా మంది అభిప్రాయం. మరి యన్టీఆర్ తన ఇమేజ్ ని చూసుకుంటాడా లేక తన పాత్ర గురించి ఆలోచిస్తాడా అనేది చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2022-04-04T15:16:48+05:30 IST