మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘గని’ ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. బాక్సింగ్ నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీతో ‘ఎఫ్3’లో కూడా నటిస్తున్నాడు ఈ హీరో. మే 25న సినిమా విడుదల కానుంది.దీంతో పాటు తాజాగా వరుణ్ తేజ్ ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. వరుణ్‌కి ఇది 12వ సినిమా. సినిమా పూర్తిగా యూరప్‌లో చిత్రీకరించనున్నారు. జూన్, జులైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘గని’ ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. బాక్సింగ్ నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీతో ‘ఎఫ్3’లో కూడా నటిస్తున్నాడు ఈ హీరో. మే 25న సినిమా విడుదల కానుంది.దీంతో పాటు తాజాగా వరుణ్ తేజ్ ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. వరుణ్‌కి ఇది 12వ సినిమా. సినిమా పూర్తిగా యూరప్‌లో చిత్రీకరించనున్నారు. జూన్, జులైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమా కోసం వరుణ్ తన కెరీర్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటాడని టాక్స్ వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు సినిమా రూ. 12 కోట్లు రెమ్యునరేషన్ గా కోట్ చేశారట. వరుణ్ ట్రాక్ రికార్డ్ బాగుండడంతో ఎంత అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం నాగార్జునతో ‘ద ఘోస్ట్’ అనే యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్న ప్రవీణ్ సత్తారు ఈ సినిమా పూర్తయిన తర్వాత వరుణ్ తేజ్ సినిమాకి షిఫ్ట్ కానున్నాడు. మరో రెండు నెలల్లో సినిమా షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ‘గని, ఎఫ్3’ చిత్రాల తర్వాత వరుణ్‌తేజ్ నటిస్తున్న చిత్రమిది.
నవీకరించబడిన తేదీ – 2022-04-05T14:49:46+05:30 IST