మాస్ మహారాజా రవితేజ గత చిత్రం ‘ఖిలాడీ’ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఆయన తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ సెట్స్‌పై ఉంది. జూలై 17న థియేటర్లలో విడుదల కానుండగా.. ఆ తర్వాత నక్కిన త్రినాథరావు ‘ధమాకా’, సుధీర్ వర్మ ‘రావణాసుర’ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇటీవలే రవితేజ తొలి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రారంభమైంది. ఈ సినిమాలతో పాటు మరో కొత్త స్ట్రాటజీని అమలు చేసేందుకు రవితేజ ప్రయత్నిస్తున్నట్లు వినికిడి. సోలో హీరోగా నటించడమే కాకుండా సీనియర్ హీరోలతో మల్టీ స్టారర్‌లో నటించాలనేది రవితేజ ఆలోచనగా తెలుస్తోంది.
మాస్ మహారాజా రవితేజ గత చిత్రం ‘ఖిలాడీ’ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఆయన తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ సెట్స్‌పై ఉంది. జూలై 17న థియేటర్లలో విడుదల కానుండగా.. ఆ తర్వాత నక్కిన త్రినాథరావు ‘ధమాకా’, సుధీర్ వర్మ ‘రావణాసుర’ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇటీవలే రవితేజ తొలి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రారంభమైంది. ఈ సినిమాలతో పాటు మరో కొత్త స్ట్రాటజీని అమలు చేసేందుకు రవితేజ ప్రయత్నిస్తున్నట్లు వినికిడి. సోలో హీరోగా నటించడమే కాకుండా సీనియర్ హీరోలతో మల్టీ స్టారర్‌లో నటించాలనేది రవితేజ ఆలోచనగా తెలుస్తోంది. అలాగే.. నిర్మాతగానూ బిజీగా ఉండాలనుకుంటున్నా.
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ రవితేజ ఈ సినిమాలో నటిస్తాడని సమాచారం. ఈ సినిమాతో పాటు మరో సీనియర్ హీరోతో కలిసి రవితేజ మరో మల్టీస్టారర్‌ను ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కూడా దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇవి కాకుండా కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్ తాజా చిత్రం ‘మట్టి కుస్తీ’లో రవితేజ కథానాయకుడిగా నటిస్తున్నట్లు సమాచారం. విష్ణు విశాల్‌కి ఇది 18వ సినిమా. దీనికి రవితేజక్ నిర్మాణ భాగస్వామ్యం కూడా ఉంది. ఈ చిత్రానికి చెల్లా అయ్యు దర్శకత్వం వహిస్తున్నారు. మరి మల్టీ స్టారర్లు, సొంత ప్రొడక్షన్ సినిమాలతో ముందుకు వెళ్లాలనే రవితేజ ఆలోచన ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2022-04-07T15:23:51+05:30 IST