ప్రస్తుతం ఇండియన్ స్క్రీన్‌పై బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రిటీల జీవిత విశేషాలను వెండితెరపై ఆవిష్కరించడం ద్వారా వారి గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు క్రీడాకారులు, పోలీసు అధికారులు, సైంటిస్టులు, సినీ ప్రముఖుల బయోపిక్‌లు మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో వెండితెరపై ప్రముఖ రచయితల బయోపిక్‌లు కూడా సందడి చేయబోతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ బయోపిక్ ‘కవిసామ్రాట్’ రూపొందుతుండగా.. ఈ జాబితాలో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటాచలం కూడా చేరబోతున్నట్లు సమాచారం.

‘అన్నమయ్య, శ్రీరామదాసు’ వంటి చిత్రాలకు కథ, మాటలు అందించిన ప్రముఖ రచయిత జెకె భారవి చలం బయోపిక్‌కు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చలం పాత్ర కోసం మొదట భారవి కీరవాణిని సంప్రదించారు. అయితే ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఇప్పుడు మరో నటుడి కోసం అన్వేషణ సాగుతోంది. తెలుగు సాహిత్యంలో చలం చిరస్మరణీయుడు. ప్రగతిశీల భావాలతో ఆయన సృష్టించిన స్త్రీ పాత్రలు సంచలనం సృష్టించాయి. ఆయన నవలలు అప్పట్లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇప్పటికీ చలం పుస్తకాలు చదివే పాఠకులు కూకోళ్లే. తన నవలలను సినిమాలుగా మలిచే ప్రయత్నంలో ఉండగానే ఇప్పుడు ఆయన బయోపిక్ రావడం విశేషం. మరి ఆ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2022-04-10T20:24:29+05:30 IST