Mahaeshbabu : మాస్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తారా?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-04-17T16:25:24+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రంలో మహేష్ నటించబోతున్నాడు. అంతకంటే ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. మహేష్ లాంటి స్టార్ తో సినిమా చేసేందుకు చాలా మంది దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా ఒకరు. బోయపాటికి ఎప్పటి నుంచో మహేష్ బాబుతో సినిమా చేయాలని కోరిక.

Mahaeshbabu : మాస్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రంలో మహేష్ నటించబోతున్నాడు. అంతకంటే ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. మహేష్ లాంటి స్టార్ తో సినిమా చేసేందుకు చాలా మంది దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా ఒకరు. బోయపాటికి ఎప్పటి నుంచో మహేష్ బాబుతో సినిమా చేయాలని కోరిక. రీసెంట్ గా ఓ సీనియర్ హీరోతో ‘అఖండ’ అనే బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన ఈ దర్శకుడు ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో యాక్షన్ సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోయపాటి మాట్లాడుతూ.. మహేష్ బాబుతో సినిమా చేయాలనేది తన డ్రీమ్ అని, అవకాశం వస్తే భవిష్యత్తులో అతనితో ఓ భారీ మాస్ యాక్షన్ థ్రిల్లర్ తీయాలనుకుంటున్నానని చెప్పాడు.

మహేష్ బాబుతో సినిమా చేయాలనేది ప్రతి దర్శకుడి కల. మరి బోయపాటికి అవకాశం వస్తే కచ్చితంగా ఇదో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అవుతుందేమో?… అయితే త్రివిక్రమ్, రాజమౌళిల ప్రాజెక్ట్స్ పూర్తి కావడానికి చాలా టైం పడుతుంది. కొన్నాళ్లుగా రాజమౌళి సినిమాలకే అంకితం కాబోతున్నాడు మహేష్. ఈ రెండూ పూర్తయిన తర్వాతే బోయపాటి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ఆ తర్వాతే సినిమా సెట్స్ పైకి వెళ్లాలి. మరి మహేష్ ఎప్పుడు బోయపాటి ఛాన్స్ తీసుకుంటాడో, సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2022-04-17T16:25:24+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *