నిన్నటి వరకు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మలయాళ అందాలతో నిండిపోయింది. అయితే కొంతకాలంగా ఆ స్థానాన్ని కన్నడ క్యూటీస్ ఆక్రమిస్తున్నారు. అనుష్క శెట్టి ఇప్పటికీ టాలీవుడ్‌ని వీడలేదు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పూజా హగ్డే, రష్మిక మందన్న, నభా నటేష్ లాంటి స్టన్నింగ్ బ్యూటీలు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా వీరి జాబితాలో చేరిన మరో కన్నడ మహిళ శ్రీనిధి శెట్టి. ‘కేజీఎఫ్’ పాన్ ఇండియా సినిమాతో శాండల్ వుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామకి దర్శకుడు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ రెండో భాగంలో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్ స్పేస్ ఇచ్చాడు. ‘కేజీఎఫ్ 2’లో శ్రీనిధి శెట్టి గ్లామర్, నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెకు సౌత్ లో వరుస అవకాశాలు వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.

అయితే శ్రీనిధి శెట్టి ఫోకస్ టాలీవుడ్ పైనే ఎక్కువగా ఉందని సమాచారం. ప్రస్తుతం తెలుగులో మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటోంది. అయితే పెద్ద హీరోల సరసన హీరోయిన్ గా నటించేందుకు ఆమె మొగ్గు చూపుతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఒక్క పెద్ద హీరోతో సినిమా వస్తే ఆమెకు పంట పండుతుందని అంటున్నారు. మరి ఆమె కోరిక తీరుతుందో లేదో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2022-04-20T20:52:39+05:30 IST