‘పుష్ప: ది రైజ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బన్నీ మేకోవర్, పెర్ఫార్మెన్స్, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, రష్మిక గ్లామర్ అప్పియరెన్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మేళవించి సినిమాను అగ్రస్థానంలో నిలిపాయి. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో రికార్డ్ కలెక్షన్స్ సాధించి.. బన్నీ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. మొదటి భాగం క్రియేట్ చేసిన సూపర్ క్రేజ్ కారణంగా రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడానికి కారకులెవరు? సెకండ్ పార్ట్ లో అంతకు మించి అభిమానులకు సర్ ప్రైజ్ లు సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు.
‘పుష్ప: ది రైజ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బన్నీ మేకోవర్, పెర్ఫార్మెన్స్, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, రష్మిక గ్లామర్ అప్పియరెన్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మేళవించి సినిమాను అగ్రస్థానంలో నిలిపాయి. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో రికార్డ్ కలెక్షన్స్ సాధించి.. బన్నీ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. మొదటి భాగం క్రియేట్ చేసిన సూపర్ క్రేజ్ కారణంగా రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడానికి కారకులు ఎవరు? రెండో భాగంలో అభిమానుల కోసం మరిన్ని సర్ ప్రైజ్ లు సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు. ఈ క్రమంలో సెకండ్ పార్ట్‌లో కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోని ఎంపిక చేస్తున్నారు.
బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి ‘పుష్ప ది రూల్’లో సీనియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాకి ఈ పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్‌కి బాస్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌కు రారాజుగా మారిన ‘పుష్పరాజ్’ని భన్వర్ సింగ్ అడుగడుగునా అడ్డుకోవడంతో.. పుష్పను కాపాడేందుకు సునీల్ శెట్టి ప్రయత్నించాడు. అలాగే ప్రీ క్లైమాక్స్‌లో సునీల్ శెట్టి ట్విస్ట్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. తెలుగులో సునీల్ శెట్టి ట్రాక్ రికార్డ్ పెద్దగా లేదు. ఇటీవల సునీల్ శెట్టి ‘గని’, అంతకుముందు మంచు విష్ణు ‘మోసగాళ్లు’ సినిమాల్లో నటించినా ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు. అలాగే.. రజనీకాంత్ ‘దర్బార్’లో సునీల్ శెట్టి విలన్‌గా నటించారు. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. మరి ‘పుష్ప ది రూల్’ సినిమా ఆయనకు మంచి హిట్ ఇస్తుందేమో చూద్దాం.
నవీకరించబడిన తేదీ – 2022-04-25T16:04:19+05:30 IST