ప్రశాంత్ నీల్: రెమ్యునరేషన్ రెట్టింపు?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-05-04T16:35:42+05:30 IST

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు మూడు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. వాటిలో, ‘KGF’ సిరీస్ పాన్-ఇండియా స్థాయిలో మరియు ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము రేపింది. దీంతో అతడి క్రేజ్ రెట్టింపు అయింది. ఈ చిత్రాల సక్సెస్ క్రెడిట్‌తో ప్రశాంత్ నీల్ తెలుగులో ఏకకాలంలో మూడు సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ హీరోగా ఓ సినిమా సెట్స్‌పై ఉంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.

ప్రశాంత్ నీల్: రెమ్యునరేషన్ రెట్టింపు?

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు మూడు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. వాటిలో, ‘KGF’ సిరీస్ పాన్-ఇండియా స్థాయిలో మరియు ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము రేపింది. దీంతో అతడి క్రేజ్ రెట్టింపు అయింది. ఈ చిత్రాల సక్సెస్ క్రెడిట్‌తో ప్రశాంత్ నీల్ తెలుగులో ఏకకాలంలో మూడు సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ హీరోగా ఓ సినిమా సెట్స్‌పై ఉంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఏకంగా రూ.25 కోట్లు అందుకున్నాడు. అయితే కొత్త సినిమాలకు రెమ్యునరేషన్‌ను రెట్టింపు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సాలార్ తర్వాత యన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయనున్నాడు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే.. రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు.

ఈ రెండు తెలుగు సినిమాలకు ప్రశాంత్ నీల్ కలిసి రూ. 50 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లు సమాచారం. అలాగే.. ‘కేజీఎఫ్ 2’ సినిమా లాభాల్లో రెమ్యూనరేషన్ తో పాటు వాటా కూడా అందుకోనున్నట్లు సమాచారం. కానీ ఆయన చేయబోయే తెలుగు సినిమాల విషయంలో నిర్మాతలు కేవలం రూ. 50 కోట్లు మాత్రమే అందించనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తర్వాత నేషనల్ క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ రెట్టింపు చేయడం పెద్ద విషయం కాదు. అలాగే.. ఆయన డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు తెలుగు నిర్మాతలు సిద్ధమయ్యారు. మరి ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయితే ప్రశాంత్ ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తాడో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2022-05-04T16:35:42+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *