మెగా 154 : రవితేజ పాత్ర ఇదేనా?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-05-05T17:30:44+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలలో బాబీ దర్శకత్వం వహించిన సినిమా ఒకటి. మెగా 154 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. వాల్తేరు బీచ్‌ నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

మెగా 154 : రవితేజ పాత్ర ఇదేనా?

మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలలో బాబీ దర్శకత్వం వహించిన సినిమా ఒకటి. మెగా 154 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. వాల్తేరు బీచ్‌ నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. చిరు పాత్రను ‘ముఠామేస్త్రీ’ తరహాలో రా, రగ్గడ్‌గా డిజైన్‌ చేశాడు దర్శకుడు బాబీ. అలాగే సినిమాలో కామెడీ కూడా ఓ రేంజ్‌లో ఉంటుంది. కామెడీ టైమింగ్‌లో చిరు రారాజు. ‘పవర్, వెంకీమామ’ చిత్రాలతో కామెడీ ఎంటర్‌టైనర్‌లు చేయడంలో బాబీ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో రవితేజ పాత్ర కూడా హైలైట్ అవుతుంది. కథకు తగ్గ తమ్ముడిగా చిరంజీవి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో చిరంజీవి అండర్ కవర్ కాప్ గా కనిపించనుండడం మెగా154 చిత్రానికి ప్రధాన హైలైట్. గతంలో చిరంజీవి ‘రుస్తుం, స్టేట్ రౌడీ’ సినిమాల్లో అండర్ కవర్ పోలీస్ పాత్రలు పోషించారు. ఆ రెండు సినిమాలు అభిమానులను ఓ రేంజ్ లో అలరించాయి. ఇప్పుడు మరోసారి మెగా154 కోసం చిరు పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. రవితేజ సరసన కేథరిన్ ట్రెస్సా కథానాయికగా నటిస్తుండగా, వారికి పాప కూడా పుట్టనుంది. కానీ రవితేజ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. త్వరలో రవితేజ, కేథరిన్‌లపై ఆసక్తికరమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మెగా154కి రవితేజను ఆహ్వానిస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారని సమాచారం.

నవీకరించబడిన తేదీ – 2022-05-05T17:30:44+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *