ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ ప్లాన్ చేస్తున్న పుష్ప 2 సీక్వెల్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ ప్లాన్ చేస్తున్న పుష్ప 2 సీక్వెల్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు మరో హాట్ న్యూస్ వచ్చి వైరల్ అవుతోంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎస్ఎస్ రాజమౌళి తన భారీ బడ్జెట్ చిత్రాలకు పేరుగాంచాడు. బాహుబలి సిరీస్ మరియు ఇటీవలి RRR సినిమాల బడ్జెట్ అందరికీ తెలిసిందే.
జక్కన్న తర్వాత మన టాలీవుడ్ లోనే కాకుండా ఇతర సౌత్ లాంగ్వేజెస్ లో కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాలు నిర్మిస్తున్నారు. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ సినిమా రూ.1000 కోట్ల మార్కును టచ్ చేసి సంచలన విజయం సాధించింది. అయితే సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ‘పుష్ప 1’ చిత్రం రూ.250 కోట్లతో రూపొందిందని ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం మేకర్స్ 400 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం.
పుష్ప పార్ట్ 2 కంప్లీట్ అయ్యేసరికి RRR బడ్జెట్ రేంజ్ కి చేరుకుంటుందని తెలుస్తోంది. పుష్ప పార్ట్ 1 కంటే సీక్వెల్ కథ పెద్దదిగా ఉండబోతోంది. అందుకే, నిర్మాతలు బడ్జెట్‌ను ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయడానికి వెనుకాడరు. ఇందులో ఎంత నిజం ఉందనేది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.
నవీకరించబడిన తేదీ – 2022-05-13T14:26:25+05:30 IST