పుష్ప ది రూల్: భారీ స్థాయిలో వ్యాపారం?

పుష్ప ది రూల్: భారీ స్థాయిలో వ్యాపారం?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-05-16T14:29:36+05:30 IST

‘పుష్ప ది రైజ్’ సినిమా అల్లు అర్జున్‌ని స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మార్చింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు జాతీయ స్థాయిలో భారీ క్రేజ్ వచ్చింది. విడుదలైన అన్ని భాషల్లో కళ్లు చెదిరే కలెక్షన్లు సాధించి.. బన్నీ స్థాయిని మరింత పెంచేశాడు. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

పుష్ప ది రూల్: భారీ స్థాయిలో వ్యాపారం?

‘పుష్ప ది రైజ్’ సినిమా అల్లు అర్జున్‌ని స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మార్చింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు జాతీయ స్థాయిలో భారీ క్రేజ్ వచ్చింది. విడుదలైన అన్ని భాషల్లో కళ్లు చెదిరే కలెక్షన్లు సాధించి.. బన్నీ స్థాయిని మరింత పెంచేశాడు. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అల్లు అర్జున్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్, సుక్కు దర్శకత్వ ప్రతిభ, రష్మిక గ్లామర్ అప్పియరెన్స్, దేవి సంగీతం ‘పుష్ప’ మొదటి భాగం విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ సినిమా క్రేజ్‌తో రెండో భాగం ‘పుష్ప ది రూల్‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ క్రమంలో ఈ సినిమా భారీ బిజినెస్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

‘పుష్ప ది రూల్’ (పుష్ప ది రూల్) ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా నాన్ థియేట్రికల్ రైట్స్‌కు భారీ డీల్ సెట్ అయ్యిందని వార్తలు వినిపిస్తుండగా, ఇప్పుడు మొత్తం రూ. 500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందని సమాచారం. మొదటి పార్ట్ భారీ విజయం సాధించడంతో ఈ స్థాయిలో బిజినెస్ డీల్ వచ్చిందని వేరే చెప్పాలా? ప్రస్తుతం సుకుమార్ అండ్ టీమ్ ‘పుష్ప ది రూల్’ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను లాక్ చేసే పనిలో ఉన్నారు. మొదటి భాగంపై వచ్చిన విమర్శలను, స్క్రిప్ట్‌లోని లోపాలను సరిదిద్దుకుని రెండో భాగాన్ని మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తున్నారు.

అలాగే.. ‘పుష్ప ది రూల్’ సినిమాలో మరిన్ని ఆసక్తికరమైన పాత్రలు అభిమానులను మెప్పిస్తాయనే టాక్ వినిపిస్తోంది. అలాగే రెండో భాగంలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ పాత్రలు మరింత పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ రాజు పుష్ప ఈ మూడు పాత్రలతో రకరకాల సవాళ్లను ఎదుర్కొంటాడు. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ అభిమానులకు డబుల్ ట్రీట్ అవుతాయని ఫిల్మ్ నగర్ సమాచారం. మరి మొదటి భాగం కంటే పుష్ప రెండో భాగం ఇంకెంత మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2022-05-16T14:29:36+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *