ఎన్టీఆర్ నెస్ట్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్ నెస్ట్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. RRR వంటి భారీ హిట్ తర్వాత శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ప్రాజెక్ట్ గురించి చరణ్ ఇప్పటికే ప్రకటించాడు. అయితే తారక్ కొత్త ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో తారక్ తన 30వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆచార్య రిజల్ట్‌తో స్టార్ట్ కావాల్సిన ఎన్టీఆర్ 30ని స్టార్ట్ చేసేందుకు కొరటాల కాస్త టైం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా కూడా ప్రారంభం కానుంది. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఎప్పుడో కన్ఫర్మ్ చేసారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో ఓ కీలక పాత్ర ఉందని, అందుకోసం నటుడు కమల్ హాసన్‌ని ఎంపిక చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అసలు కమల్-తారక్ కాంబినేషన్‌లో ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడి ఆలోచనే అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ కమల్ హాసన్, తారక్ లు బుల్లితెరపై కనిపిస్తే మరెవ్వరికీ లేని ఫీలింగ్ కలుగుతుంది. ఎన్టీఆర్ 31 కోసం ప్రశాంత్ నీల్ నిజంగానే కమల్‌ని సంప్రదించాడా..గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ కాంబో అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే అంచనాలు తారా స్థాయిలో ఉంటాయనడంలో సందేహం లేదు.
నవీకరించబడిన తేదీ – 2022-05-17T16:53:45+05:30 IST