యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ ప్రస్తుతం జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో ‘శేఖర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రాజశేఖర్ తదుపరి ఏ సినిమాలో నటించబోతున్నాడు అనే ఆసక్తి నెలకొంది. వరుసగా ‘గరుడవేగ, కల్కి, శేఖర్’ చిత్రాల్లో పోలీస్ పాత్రలు పోషించారు. ఐతే నెక్స్ట్ మూవీలో మళ్లీ అదే ఆడతాడని అనుకుంటే పొరపాటే.
యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ ప్రస్తుతం జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో ‘శేఖర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రాజశేఖర్ తదుపరి ఏ సినిమాలో నటించబోతున్నాడు అనే ఆసక్తి నెలకొంది. వరుసగా ‘గరుడవేగ, కల్కి, శేఖర్’ చిత్రాల్లో పోలీస్ పాత్రలు పోషించారు. ఐతే నెక్స్ట్ మూవీలో మళ్లీ అదే ఆడతాడని అనుకుంటే పొరపాటే. రాజశేఖర్ తన తదుపరి సినిమా కోసం రూట్ మారుస్తున్నాడు. ఈసారి మాఫియా డాన్‌గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ‘ఆహుతి, గెడ్డం గ్యాంగ్’ వంటి సినిమాల్లో మాఫియా డాన్‌గా నటించాడు. మరోసారి అదే పాత్రలో నటించబోతున్నాడనే చెప్పాలి.
‘ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి’ వంటి చిత్రాలతో తన ప్రతిభను నిరూపించుకున్న దర్శకుడు పవన్ సాధినేని. ఇటీవల రాజశేఖర్‌ని కలిసిన పవన్.. ఆయనకు మనసుకు హత్తుకునే కథ చెప్పాడు. రాజశేఖర్ కెరీర్ లో ఇంత డిఫరెంట్ రోల్ చేయకపోవడంతో వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వీరిద్దరి కలయికలో త్వరలో ఓ స్టైలిష్ యాక్షన్ సినిమా రూపొందనుందని సమాచారం. ఇప్పటికే కథ సిద్ధమవుతుండగా, అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. కథలో అన్ని రకాల ఎలిమెంట్స్ మిక్స్ చేసిన దర్శకుడు.. ప్రస్తుతం హీరోయిన్ అన్వేషణలో ఉన్నాడు. మరి రాజశేఖర్ మాఫియా డాన్ గా ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2022-05-17T21:49:30+05:30 IST