మరో తమిళ దర్శకుడితో రామ్‌చరణ్?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-05-19T20:01:22+05:30 IST

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌ల విడుద‌లైన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. తాజాగా తమిళ క్రేజీ డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే చాలా షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో చెర్రీ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.

మరో తమిళ దర్శకుడితో రామ్‌చరణ్?

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌ల విడుద‌లైన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తాజాగా తమిళ క్రేజీ డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే చాలా షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో చెర్రీ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఇక దీని తర్వాత ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అలాగే చాలా మంది టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు చరణ్ తో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ మరో తమిళ దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

‘ఖైదీ, మాస్టర్’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం కమల్ హాసన్ తో ‘విక్రమ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.ఈ సినిమా తర్వాత రజనీకాంత్, అజిత్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేయబోతున్నాడు లోకేష్. ఇవే కాకుండా ఇటీవల రామ్‌చరణ్‌కి లోకేష్ కథ చెప్పగా, దానికి బాగా ఇంప్రెస్ అయిన చెర్రీ అతనితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే చరణ్ కి చాలా కమిట్ మెంట్స్ ఉండటంతో ఈ సినిమాను హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

వరుస విజయాల నేపథ్యంలో లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయడానికి చెర్రీ అంగీకరించాడని వేరే చెప్పాలా? ప్రస్తుతం తెలుగు హీరోలతో సినిమాలు చేసేందుకు తమిళ దర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పుడు వీరి జాబితాలోకి లోకేష్ కూడా చేరిపోయాడు. త్వరలో విడుదల కాబోతున్న విక్రమ్ సినిమాతో లోకేష్ కు సూపర్ హిట్ అందితే ఇక తిరుగుండదు. తెలుగులో మరికొందరు స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. మరి చెర్రీ – లోకేష్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2022-05-19T20:01:22+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *