కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ తలపతి విజయ్ తెలుగులో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయబోతున్నారనే వార్త ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ తలపతి విజయ్ తెలుగులో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయబోతున్నారనే వార్త ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు చాలా తక్కువ. మున్నా సినిమాతో దర్శకుడిగా మారిన వంశీ పైడిపల్లి.. ఆ తర్వాత బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి వంటి చిత్రాలను రూపొందించాడు. వీటిలో ఒక్కటి మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ కూడా మంచి కమర్షియల్ హిట్స్ అయ్యాయి.
మహర్షి వంటి డీసెంట్ హిట్ తర్వాత వంశీ పైడిపల్లి మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని అనుకున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. అయితే లైన్ నచ్చి ఓకే చెప్పిన మహేష్ ఆ తర్వాత ఫుల్ స్క్రిప్ట్ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ కి నో చెప్పాడు. అదే కథను తమిళ హీరో విజయ్ ఇమేజ్ కి తగ్గట్టుగా కీలక మార్పులతో వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు. విజయ్ కెరీర్‌లో 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో దళపతి 66 చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్‌గా మారింది. తమిళంతో పాటు తెలుగులోనూ రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ డిజైన్ చేశాడని, ఒక్కో క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ధృవీకరించే వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన మృగం చిత్రం తమిళంలో హిట్‌గా నిలిచింది. అదే సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
నవీకరించబడిన తేదీ – 2022-05-19T15:17:47+05:30 IST