నాగ చైతన్య : తమ్ముడు దర్శకుడితో సినిమా?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-05-23T19:25:47+05:30 IST

‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ‘థ్యాంక్యూ’ అనే థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. దీని తర్వాత తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు, పరశురామ్, ఆ తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో చైతూ నటించబోతున్నాడు.

నాగ చైతన్య : తమ్ముడు దర్శకుడితో సినిమా?

‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ‘థ్యాంక్యూ’ అనే థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. దీని తర్వాత తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు, పరశురామ్, ఆ తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో చైతూ నటించబోతున్నాడు. వీరితో పాటు మరో టాలెంటెడ్ డైరెక్టర్ కూడా నాగ చైతన్య దర్శకుల జాబితాలో చేరబోతున్నాడు. ఆయన మరెవరో కాదు బొమ్మరిల్లు భాస్కర్. ‘బొమ్మరిల్లు, పరుగు, ఆరెంజ్, ఒంగోలు గీత’ వంటి చిత్రాలతో మంచి దర్శకుడిగా కనిపించిన భాస్కర్ ఇటీవల అఖిల్ అక్కినేని నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో దర్శకుడిగా మంచి ఫామ్‌లోకి వచ్చాడు. తమ్ముడి కెరీర్‌లో తొలి హిట్‌ ఇచ్చిన ఈ దర్శకుడితో కలిసి పనిచేయాలని చైతూ భావిస్తున్నాడట.

దర్శకుడు భాస్కర్ రీసెంట్ గా నాగ చైతన్యకి యూత్ ఫుల్ స్టోరీ చెప్పాడు. కథ బాగా ఇంప్రెస్ అయిన చైతూ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వినికిడి. భాస్కర్ ఇప్పటికే కథను లాక్ చేసాడు. పరశురామ్ తర్వాత చైతూ ఈ సినిమాలో నటిస్తాడని అంటున్నారు. ప్రేమకథా చిత్రాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న బొమ్మరిల్లు భాస్కర్ నాగ చైతన్య కోసం ఎలాంటి కథ రాశాడనే ఆసక్తి నెలకొంది.

నవీకరించబడిన తేదీ – 2022-05-23T19:25:47+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *