దర్శకుడు పరశురామ్‌తో అక్కినేని నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. తాజా సమాచారం ఏంటంటే.. ఈ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు.
దర్శకుడు పరశురామ్‌తో అక్కినేని నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. తాజా సమాచారం ఏంటంటే.. ఈ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురామ్ గీత గోవిదం చిత్రానికి దర్శకత్వం వహించి సూపర్ హిట్ అందుకున్నారు ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా మే 12న విడుదలై మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న చిత్రం సర్కారు వారి పాట.
ఈ క్రమంలో పరశురామ్ తన నెక్స్ట్ మూవీని అక్కినేని నాగ చైతన్యతో చేయబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా పరశురామ్ స్వయంగా వెల్లడించారు. అయితే ఈ కాంబినేషన్ లో ప్లాన్ చేస్తున్న సినిమాకు నాగ చైతన్య తాత పేరు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లెజెండరీ హీరోల్లో అక్కినేని నాగేశ్వరావు ఒకరు. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నాగేశ్వరరావు పౌరాణిక, జానపద చిత్రాలతో పాటు మల్టీ స్టారర్ చిత్రాలలో నటిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం మనం. కొడుకు నాగార్జున మనవళ్లు నాగ చైతన్య, అఖిల్‌లతో ఈ సినిమా తీశాడు. ఇప్పుడు నాగేశ్వరరావు అనే టైటిల్ తో నాగ చైతన్య సినిమా చేయనుండడం విశేషం. అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే చైతూ థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే చైతూ డిజిటల్ ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్ చేస్తున్నాడు.
నవీకరించబడిన తేదీ – 2022-05-25T14:29:08+05:30 IST