F4 కోసం ప్లాన్ మారుతుందా? | f4 చిత్రం krkk-MRGS-చిత్రజ్యోతి కోసం మరొక ప్లాన్

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-05-29T18:34:42+05:30 IST

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం వినోదాల జల్లు ‘F3’. సూపర్ హిట్ చిత్రం ‘ఎఫ్ 2’కి ఇది సీక్వెల్ అయినప్పటికీ తొలి భాగంలోని నటీనటులను కొనసాగిస్తూ సరికొత్త కథాంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. అప్పట్లో సంక్రాంతి అల్లుళ్లుగా సందడి చేసిన వెంకీ, వరుణ్ ఈసారి సమ్మర్ సోగ్గాళ్లుగా అలరించారు.

F4 కోసం ప్లాన్ మారుతుందా?

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం వినోదాల జల్లు ‘F3’. సూపర్ హిట్ చిత్రం ‘ఎఫ్ 2’కి ఇది సీక్వెల్ అయినప్పటికీ తొలి భాగంలోని నటీనటులను కొనసాగిస్తూ సరికొత్త కథాంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. అప్పట్లో సంక్రాంతి అల్లుళ్లుగా సందడి చేసిన వెంకీ, వరుణ్ ఈసారి సమ్మర్ సోగ్గాళ్లుగా అలరించారు. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సీక్వెల్ కూడా సూపర్ హిట్ అవుతుందని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోలు వెంకీ, వరుణ్ అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ‘ఎఫ్‌3’ సినిమా ముగింపులో దర్శకుడు అనిల్ రావిపూడి బస్సు డ్రైవర్ అవతార్‌ తీసుకుని మూడో పార్ట్‌పై హింట్‌ ఇచ్చాడు. దీంతో ‘ఎఫ్4’ (ఎఫ్4)పై మరింత ఆసక్తి నెలకొంది.

అయితే ‘ఎఫ్4’ విషయంలో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే.. మూడో పార్ట్ కోసం నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ వేస్తున్నారు. నిజానికి డిఫరెంట్‌ కాస్టింగ్‌తో ‘ఎఫ్‌3’ సినిమా తీయాలనుకున్నారు. అయితే మొదటి భాగానికి వచ్చిన అనూహ్య స్పందనను దృష్టిలో ఉంచుకుని అదే మ్యాజిక్‌ను కొనసాగించాలనుకున్నారు. దాంతో మొదటి భాగానికి మించిన రెమ్యునరేషన్‌తో రెండో భాగంలో కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అందుకే ‘ఎఫ్4’ విషయంలో బడ్జెట్ తగ్గించే ప్రయత్నం చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అంటే మూడో భాగంలో నటీనటులు భిన్నంగా ఉంటారన్నమాట. అయితే తొలి రెండు భాగాల్లో అభిమానులను మెప్పించిన వెంకీ, వరుణ్‌ల స్థానంలో మిగతా హీరోలు ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది. మరి ఈ విషయంలో అనిల్ రావిపూడి ఆలోచన ఏంటో తెలియదు కానీ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

నవీకరించబడిన తేదీ – 2022-05-29T18:34:42+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *