మహేష్ తండ్రిగా కన్నడ స్టార్..?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-05-31T13:57:13+05:30 IST

ఇటీవల సర్కార్ వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కమర్షియల్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.

మహేష్ తండ్రిగా కన్నడ స్టార్..?

ఇటీవలే సర్కార్ వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కమర్షియల్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరో రెండు ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మరొకటి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించబోతున్నారు. ముందుగా త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం మహేష్ తన భార్యా పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్తున్నాడు.

దీని తర్వాత త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. ‘అర్జునుడు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ని పెట్టేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్ ఉందట. అది మహేష్ బాబు తండ్రి పాత్ర అని.. దీని కోసం కన్నడ స్టార్ వి.రవిచంద్రన్ (వి.రవిచంద్రన్)ని తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆయనను ఎంపిక చేశారని, త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

కాగా, జూలై నుంచి ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముందుగా మహేష్ పై సోలో సాంగ్ షూట్ చేయబోతున్నట్లు సమాచారం. అలాగే, ఒక పోరాటం. ఆ తర్వాత లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసి మెజారిటీ టాకీ పార్ట్ కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. దాదాపు పదకొండేళ్ల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. ఇక ఈ సినిమాలో ఆయన రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు తాజా సమాచారం. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. ఇందుకోసం రాజమౌళికి బల్క్ డేట్స్ ఇచ్చాడు మహేష్. వి విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు.

నవీకరించబడిన తేదీ – 2022-05-31T13:57:13+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *