మళ్లీ మెగా హీరోతో కొరటాల శివ..?

మళ్లీ మెగా హీరోతో కొరటాల శివ..?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-05-31T16:11:22+05:30 IST

తాజాగా దర్శకుడు కొరటాల శివ మరోసారి మెగా హీరోతో సినిమా చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మళ్లీ మెగా హీరోతో కొరటాల శివ..?

తాజాగా దర్శకుడు కొరటాల శివ మరోసారి మెగా హీరోతో సినిమా చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఆయన మెగా మల్టీస్టారర్ ఆచార్య చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కొరటాల కెరీర్‌లో తొలి ఫ్లాప్‌ చిత్రం ఆచార్య. దాంతో తదుపరి సినిమాతో భారీ విజయం సాధించాలని కసరత్తు చేస్తున్నారు.

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. తాజాగా తారక్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీన్ని బట్టి తారక్ – కొరటాల కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం ఎన్టీఆర్ 30 అని అర్థమవుతోంది. జూన్ లేదా జులై నుండి ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయితే ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కొరటాల మరో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఆచార్య కంటే ముందే చరణ్‌తో సినిమా ప్లాన్ చేశాడు. అయితే చరణ్ RRR సినిమాతో లాక్ అవ్వడంతో ఆచార్య చిరు ఆఫర్ ఇచ్చాడు. ఇక ఈ ఫ్లాప్ మెగా అభిమానులకు కూడా చాలా నిరాశ కలిగించింది. దాంతో చరణ్ తో భారీ పాన్ ఇండియన్ సినిమా చేసి సాలిడ్ హిట్ ఇవ్వాలని కశితో నెక్స్ట్ ప్రాజెక్ట్ కి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి చరణ్ – కొరటాల కాంబో ప్రాజెక్ట్ ఎప్పుడొస్తుందో చూడాలి. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నాడు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దిల్ రాజు తొలిసారిగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

నవీకరించబడిన తేదీ – 2022-05-31T16:11:22+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *