మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ ఎంటర్‌టైనర్ చిత్రాలలో మెగా 154 కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా పేరు వాల్తేరు వీరయ్యగా ప్రచారం జరుగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ ఎంటర్‌టైనర్ చిత్రాలలో మెగా 154 కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా పేరు వాల్తేరు వీరయ్యగా ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా ఆచార్య సినిమాతో నిరాశపరిచిన చిరు తన తదుపరి సినిమాతో మంచి విజయం సాధించాలని చూస్తున్నాడు. ఇప్పటికే మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా సందడి చేయనున్నారు. మలయాళంలో హిట్టయిన లూసిఫర్‌కి తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న గాడ్‌ఫాదర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
అదే క్రమంలో మెగాస్టార్ తన 154వ సినిమాలో నటిస్తుండగా.. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ మరో హీరోగా నటిస్తున్నాడు. చిరు సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అరాచకం ప్రారంభం అంటూ చిత్రబృందం విడుదల చేసిన చిరు ఫస్ట్ లుక్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తమిళంలో హీరోగా, కీలక పాత్రలు పోషిస్తున్న విజయ్ సేతుపతి తెలుగులోనూ అద్భుతమైన పాత్రలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. మెగాస్టార్ సైరాలో ప్రధాన పాత్ర పోషించిన విజయ్ ఆ తర్వాత ఉప్పెనలో హీరోయిన్ తండ్రిగా నటించి మెప్పించాడు.
ఇప్పుడు మెగా 154 ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ చిన్నపాటి విలన్‌గా కనిపించబోతున్నాడని సమాచారం. ఇదే నిజమైతే ఈ విలక్షణ నటుడికి మరో గొప్ప పాత్రలో నటించే అవకాశం దక్కుతుంది. మరి మెగా 154లో విజయ్ సేతుపతి నటించే అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే మెగాస్టార్ భోళాశంకర్ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. చాలా ఏళ్ల తర్వాత దర్శకుడిగా మెగా ఆఫర్ అందుకున్న మెహర్ రమేష్ చిరుకు భారీ హిట్ ఇవ్వాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తమన్నా కథానాయికగా కనిపించనుండగా, కీర్తి సురేష్ కీలక పాత్రలో కనిపించనుంది.
నవీకరించబడిన తేదీ – 2022-05-31T17:21:02+05:30 IST