నాగ చైత‌య‌న : ఆ దర్శకులతో సినిమాలు ఫిక్స్ అయ్యాయా?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-05-31T17:48:12+05:30 IST

‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న అక్కినేని నాగ చైతన్య. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

నాగ చైత‌య‌న : ఆ దర్శకులతో సినిమాలు ఫిక్స్ అయ్యాయా?

‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న అక్కినేని నాగ చైతన్య. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే.. ఆయన దర్శకత్వంలో నెట్‌ఫ్లిక్స్ కోసం ‘దూత’ అనే క్రైమ్ సిరీస్ రూపొందుతోంది. ఇదిలావుంటే… వీటి తర్వాత చైతూ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు, నందిని రెడ్డి దర్శకత్వంలో కూడా నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుల తర్వాత చేయబోయే సినిమాలను కూడా చైతూ లాక్ చేసినట్లు సమాచారం.

నాగ చైతన్య తదుపరి చిత్రాల జాబితాలో కిషోర్ తిరుమల, రాహుల్ సాంకృత్యాయన్ మరియు విజయ్ కనకమేడల వంటి దర్శకులు కూడా ఉన్నారు. అయితే అవి కాకుండా చైతూ పరశురామ్ దర్శకత్వంలో నాగేశ్వరరావు అనే సినిమా చేయబోతున్నాడు. నిజానికి పరశురామ్ చైతూతో ముందుగా సినిమా చేయాలనుకున్నాడు. కథ కూడా సిద్ధమైంది. అయితే అప్పట్లో మహేష్ కి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కమిట్మెంట్ ప్రకారం పరశురామ్ తన తదుపరి చిత్రాన్ని నాగ చైతన్య హీరోగా చేయనున్నాడు. త్వరలో ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి.

నాగ చైతన్య లిస్ట్‌లో మరో డైరెక్టర్ తరుణ్ భాస్కర్. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. దర్శకుడిగా కాస్త గ్యాప్ తీసుకుని నటుడిగా మారిన తరుణ్.. మంచి కథ రాసుకుని తదుపరి సినిమా చైతూతో చేయబోతున్నాడు. విజయ్ కనకమేడల, కిషోర్ తిరుమల సినిమాలు ఇప్పట్లో రాకపోవచ్చని తెలుస్తోంది. అయితే రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి నాగ చైతన్య దాదాపు అరడజను సినిమాలను లైన్లో పెట్టాడు. ముందుగా తనకు హిట్లు ఇచ్చిన దర్శకులతోనే సినిమాలు చేయనుండడం విశేషం.

నవీకరించబడిన తేదీ – 2022-05-31T17:48:12+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *