మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గత సెప్టెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ మెగా హీరో.. రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గత సెప్టెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ మెగా హీరో.. రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇది తేజ్ కెరీర్‌లో 15వ (SD15) సినిమా. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ‘భమ్ బోలేనాథ్’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తూ కథ, స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. మిస్టికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో కథ, కథనాలు తెరకెక్కనున్నాయని సమాచారం. ముంబయి నుంచి మాయమాటలతో అనుమానాస్పదంగా మరణిస్తున్న ఓ గ్రామానికి వచ్చే ఇంజనీర్ పాత్రలో సాయితేజ్ కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ రహస్య సంఘటనలను హీరో ఎలా ఛేదిస్తాడు? అతను ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు? అనే నేపథ్యంతో ఈ కథ ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో డిఫరెంట్ జోనర్‌లో సినిమా రూపొందుతోందని చిత్ర బృందం హింట్ ఇచ్చింది. సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్ అందించిన కథతో తేజ్ తొలిసారిగా ఈ జోనర్ లో సినిమా చేయడం ఆసక్తికరమే అని చెప్పాలి. కెరీర్ ప్రారంభం నుంచి వినూత్న కథాంశాలను ఎంచుకునే ఈ మెగా హీరో ఈసారి థ్రిల్లర్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గతంలో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలు హిట్ అయిన సంగతి తెలిసిందే.
నవీకరించబడిన తేదీ – 2022-05-31T18:20:24+05:30 IST