అఖిల్ – భాస్కర్: మరోసారి..? | అఖిల్ భాస్కర్ మరోసారి-MRGS-చిత్రజ్యోతి

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-06-05T17:56:02+05:30 IST

అక్కినేని అఖిల్ మూడు సినిమాలు చేసినా.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో హిట్ అందించాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్.

అఖిల్ - భాస్కర్: మరోసారి..?

అక్కినేని అఖిల్ మూడు సినిమాలు చేసినా.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో హిట్ అందించాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. దాంతో మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు. చిత్రీకరణ దాదాపు ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాక్షి వైద్య కథానాయికగా నటిస్తుండగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ – సురేందర్ 2 సినిమా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

అయితే ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ చేయబోయే సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని కథలు ఫైనల్ అయ్యాయి. వీటిలో ఒకటి బొమ్మరిల్లు భాస్కర్‌ సిద్ధం చేసిన కథతో తెరకెక్కనుందని సమాచారం. గతంలో అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో మళ్లీ భాస్కర్ దర్శకత్వంలో నటించేందుకు అఖిల్ ఆసక్తి చూపిస్తున్నాడు.

ఇప్పటికే కథ కూడా అలానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ దీనిని నిర్మించనుంది. ఇటీవల ఈ సంస్థలో నిర్మిస్తున్న చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అయితే అఖిల్-భాస్కర్ కాంబో సినిమా ఎప్పుడు అఫీషియల్ గా ఎనౌన్స్ అవుతుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే మలయాళంలో సూపర్ హిట్ అయిన బ్రో డాడీ తెలుగు రీమేక్‌లో నాగార్జున, అఖిల్‌లు కలిసి నటిస్తారని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2022-06-05T17:56:02+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *