మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం ‘ఆచార్య’ అభిమానులను నిరాశపరిచింది. ఈ క్రమంలో తన తదుపరి సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం మోహన్ రాజా ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేష్ ‘బోలశంకర్’, బాబీ ‘వాల్తేర్ వీరయ్య’ (టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు)లో వరుసగా నటిస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం ‘ఆచార్య’ అభిమానులను నిరాశపరిచింది. ఈ క్రమంలో తన తదుపరి సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం మోహన్ రాజా ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేష్ ‘బోలశంకర్’, బాబీ ‘వాల్తేర్ వీరయ్య’ (టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు)లో వరుసగా నటిస్తున్నాడు. వీటితో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా కూడా ప్రకటించాడు చిరు.
అయితే చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాల్లో ప్రముఖ తారలు నటిస్తుండటం విశేషం. ‘గాడ్ ఫాదర్’లో సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో చిరంజీవికి తమ్ముడిగా మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. వీటితో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోళా శంకర్’ చిత్రంలో నితిన్ ఓ ప్రత్యేక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.
‘భోళాశంకర్’ చిత్రంలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మహానటి కీర్తి సురేష్ చెల్లెలు పాత్రలో నటిస్తుండటం విశేషం. ఆమెకు జోడీగా నితిన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. నితిన్, కీర్తి సురేష్ గతంలో ‘రంగే’ సినిమాలో జంటగా నటించారు. తమిళంలో అజిత్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘వేదాలమ్’కి భోళాశంకర్ అధికారిక రీమేక్. ఇందులో అజిత్ చెల్లెలుగా లక్ష్మీ మీనన్ నటించగా.. ఆమెకు జోడీగా అశ్విన్ కాకుమాను నటించింది. ‘భోళాశంకర్’లో నితిన్ నటిస్తున్నాడని వినికిడి. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే…కొద్ది రోజులు ఆగాల్సిందే.
నవీకరించబడిన తేదీ – 2022-06-14T14:56:41+05:30 IST